జాతీయ వార్తలు

‘రా’కు ఆర్‌టిఎ నుంచి మినహాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 27: విదేశాల్లో పనిచేస్తున్న రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ (రా) అధికారులు, ఉద్యోగులకు న్యాయపరమైన రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన నియమ, నిబంధనలను వెల్లడించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఎ) కింద ఈ వివరాలను వెల్లడించేందుకు కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ నిరాకరించింది. తమ ఆధ్వర్యంలో పనిచేస్తున్న రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్‌కు మానవ హక్కుల ఉల్లంఘనలు, అవినీతికి సంబంధించిన ఆరోపణలు మినహా మిగిలిన అన్ని అంశాల్లో సమాచార హక్కు చట్టం నుంచి మినహాయింపు ఉందని, కనుక ‘రా’ ఏజెంట్లకు ఉద్దేశించిన నియమ, నిబంధనలను వెల్లడించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.