జాతీయ వార్తలు

మధ్యప్రదేశ్‌తో విడదీయలేని బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, ఆగస్టు 17: వాజపేయి సొంత రాష్టమ్రైన మధ్యప్రదేశ్ ఆయన రాజకీయ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడంలో కీలకపాత్ర వహించింది. ఈ రాష్ట్రం నుంచే ఆయన రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అంతేగాక 22 సంవత్సరాల క్రితం జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన ప్రధాని అభ్యర్థిత్వాన్ని పార్టీ ప్రకటించింది ఈ రాష్ట్రంలోనే. గ్వాలియర్‌లో జన్మించిన ఆయన 1971లో జనసంఘ్ తరఫున తొలిసారిగా ఎన్నికయ్యారు. తర్వాత విదీషా నుంచి మరోసారి ఎన్నికయ్యారు. ధార్ జిల్లాలో జరిగిన ఒక బహిరంగ సభలో బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థి వాజపేయిగా ఆ పార్టీ నేత ఎల్‌కె అద్వానీ 1996లో ప్రకటించారు. గిరిజన ప్రాంతంలో ఆ పార్టీ అలాంటి ప్రకటన చేయడం అందరినీ ఆశ్చర్యపరిచినా, మర్నాటికల్లా ఆ వార్త దేశమంతా వ్యాపించింది. అదే సంవత్సరంలో ఆయన ప్రధాని అయ్యారు. అయితే ఆయన ఆ పదవిలో కేవలం 13 రోజులు మాత్రమే ఉన్నారు. రెండోసారి ప్రధానిగా ఎన్నికైనప్పుడు 13 నెలలు, తర్వాత 1999-2004 మధ్య పూర్తికాలం ప్రధానిగా పనిచేశారు. వాజపేయి అభిమాని, అడ్వకేట్ విజయ్ సింగ్ చౌహాన్ 1995లో గ్వాలియర్‌లోని సత్యనారియన్‌కి టెక్రీ ప్రాంతంలో ఒక దేవాలయాన్ని నిర్మించారు. వాజపేయిపై అభిమానంతో తాను గుడిలో ఒక ఫొటో పెట్టి నిత్యం ఆరతి ఇస్తుంటామని ఆయన వెల్లడించారు. కాగా, 1984లో గ్వాలియర్ నుంచి పోటీ చేసిన వాజపేయి కాంగ్రెస్ నేత మాధవరావు సింధియా చేతిలో ఓడిపోయారు. అయితే 1991లో విదీష, లక్నోలో పోటీ చేసి రెండు చోట్లా గెలిచారు. తర్వాత లక్నో స్థానాన్ని ఉంచుకుని విదీషను విడిచిపెట్టారు.