జాతీయ వార్తలు

మా అవసరాలు తీర్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 20: తెలంగాణ నీటి అవసరాలు తీర్చిన తర్వాత మిగిలిన జలాలను అనుసంధానానికి వినియోగించుకోవడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం హరీష్‌రావు విలేఖరులతో మాట్లాడుతూ- రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత మిగులు జలాలను తీసుకుపోవడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశామన్నారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో తెలంగాణ నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు. తెలంగాణకు కేటాయించిన 954 టీఎంసీల నిరక జలాలు పోగా, తమ రాష్ట్ర అవసరాలు తీరిన తరువాత మిగిలిన నీటిని తీసుకోండని చెప్పామన్నారు. సీతారామ ప్రాజెక్టు హైడ్రాలజీ అనుమతులకు క్లియరెన్స్ ఇవ్వకుండా నదుల అనుసంధానానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికను తయారుచేయడాన్ని తాము గట్టిగా వ్యతిరేకించినట్టు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నదులలోని నీటి లభ్యత, ప్రాజెక్టుల్లోని నీటి నిల్వాలు, ఆయా రాష్ట్రాల నీటి అవసరాలు తీరిన తర్వాత, అదనపు నీటిని కావేరి నదీ పరీవాహక ప్రాంతానికి తీసుకుపోవడానికి తాము వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రికి వివరించినట్టు తెలిపారు. దేశంలోని ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం లేదని, 60:40 నిష్పత్తిలో గ్రాంట్లు ఇస్తామని కేంద్రం చెప్పిందని, కాళేశ్వరం ప్రాజెక్టుకు అదేతరహాలో గ్రాంట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్టు వెల్లడించారు. మహారాష్టల్రోని కొన్ని ప్రాజెక్టులకు ఇచ్చినట్లుగానే, తెలంగాణ ప్రాజెక్టులకూ గ్రాంట్లు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరినట్టు తెలిపారు. వారం రోజులుగా వర్షాలు బాగా కురుస్తున్నాయని, దీనిపై అధికారులను అప్రమత్తం చేశామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల పరిస్థితిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమీక్షిస్తున్నారని హరీష్‌రావు వెల్లడించారు.

చిత్రం..కేంద్ర మంత్రులతో సమావేశమైన మంత్రి హరీశ్‌రావు, ఏపీ మంత్రి దేవినేని ఉమ