జాతీయ వార్తలు

ఒక సాహసం.. 26 మంది ప్రాణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 20: ప్రకృతి విలయానికి అల్లకల్లోలమైన కేరళలో త్రివిధ దళాలు ప్రాణాలకు సైతం తెగించి అందరి మన్ననలూ అందుకుంటున్నారు. శుక్రవారం నావికాదళం చూపిన సమయస్పూర్తి, తెగువ 26 మంది ప్రాణాలను కాపాడింది. పైలెట్ చిన్న పొరపాటు చేసినా సెకన్లలో హెలికాప్టర్ తునాతునకలైపోవడమే కాదు, అందరి ప్రాణాలూ గాలిలో కలిసిపోయేవి. థ్రిల్లర్ సినిమా దృశ్యంలా ఉన్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. సైన్యం ధైర్య సాహసాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఛాలాకుడే ప్రాతం మొత్తం జలమయమైంది. ఒక ఇంట్లో 26 మంది చిక్కుకుపోయారు. బయట అడుగుపెట్టడానికే వీలులేని పరిస్థితి. సమాచారం అందుకున్న నేవీ సిబ్బంది హెలీకాప్టర్‌తో వెళ్లారు. అయితే హెలికాప్టర్ దిగేందుకే ఎక్కడా చోటులేదు. దీంతో 33 ఏళ్ల పైలెట్ పెద్ద సాహసమే చేశాడు. ఇంటి పైకప్పుపైనే హెలికాప్టర్ దించేశాడు. అంతే క్షణాల్లో 26 మందిని హెలికాప్టర్‌లోకి ఎక్కించారు. ఆ వెంటనే హెలీకాప్టర్ రయ్‌మంటూ గాల్లోకి ఎగిరింది. ఇంటి పైకప్పుపై చాలీచాలని చోటులో హెలికాప్టర్ దించడం పెద్ద రిస్కే. అయితే కష్టాల్లో ఉన్నవారిని రక్షించాలని మాత్రమే ఆ సమయంలో అనుకుని అంతటి సాహసానికి దిగినట్టు లెఫ్టినెంట్ కమాండర్ అభిజీత్ గరుడ్ వెల్లడించారు. టీమ్ సభ్యులంతా సమష్టిగా తీసుకున్న నిర్ణయంతోనే ఇంతటి సాహసం చేసినట్టు ఆయన స్పష్టం చేశారు.
తొలుత నలుగుర్ని సునాయాసంగానే ఎక్కించామని, మిగతా 22 మందిని హెలికాప్టర్‌లోకి తీసుకురావడం కత్తిమీద సాముగా ఆయన అభివర్ణించారు. పైలెట్ ఏమాత్రం చిన్న పొరపాటు చేసినా పరిస్థితి మరోలా ఉండేదని ఆయన అన్నారు. ఆ సమయంలో పైలెట్ నిర్ణయం సరైందేనని అనిపించిందని కూడా ఆయన చెప్పారు. తాము రక్షించిన వారిలో 80 ఏళ్ల వృద్ధురాలు కూడా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. హెలికాప్టర్‌లో లెఫ్టినెంట్ కమాండర్ రజనీష్ (కో-పైలెట్), లెఫ్టినెంట్ సత్యార్థ్ (నావిగేటర్), అజిత్ (వించ్ ఆపరేటర్), రాజన్ (ఫ్రీ డైవర్) ఉన్నట్టు పైలెట్ వెల్లడించారు.

చిత్రాలు..వరదలతో కేరళలో విమాన యానం పూర్తిగా నిలిచిపోయంది. ప్రయాణికలను అత్యవసరంగా చేరవేసేందుకు కొచ్చిలోని ఐఎన్‌ఎస్ గరుడ నావల్ బేస్‌ను యుద్ధప్రాతిపదికపై సిద్ధం చేశారు. అక్కడ సోమవారం దిగిన ఓ ప్యాసింజర్ విమానం.
*ఇన్‌సెట్‌లో ఇంటి పైకప్పుపై వాలిన హెలికాప్టర్