జాతీయ వార్తలు

ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 20: భారీ వర్షాలు, వరదలతో కకావికలమైన కేరళ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి పారిశ్రామికవేత్తలు, వ్యాపార వర్గాలు ముందుకు రావాలని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు పిలుపునిచ్చారు. విపత్కర పరిస్థితుల్లో ఉన్న కేరళ ప్రజలకు మానవతా దృక్పధంతో చేయూత నివ్వాలని సోమవారం ఆయన విజ్ఞప్తి చేశారు. వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వశాఖలతోపాటు పౌర విమాన యాన శాఖను సురేష్ ప్రభు చూస్తున్నారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విమానాలు, హెలికాప్టర్లను కేరళకు పంపినట్టు ఆయన వెల్లడించారు. సుమారు 200 మంది చనిపోగా ఏడున్నర లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఆయన తెలిపారు. కేరళను ఆదుకోవడంలో రాజకీయాలకు తావులేదన్న మంత్రి రాష్ట్రానికి అన్నివిధాలా చేయూత నిస్తామని ప్రకటించారు. ‘మీకు ఎలా వీలుంటే అలా రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించాలని పారిశ్రామికవేత్తలు, వ్యాపార సంస్థలను కోరాం’ అని సురేష్ ప్రభు తెలిపారు. అలాగే సీఐఐ, ఫిక్కీ లాంటి సంస్థలతో డీఐపీపీ కార్యదర్శి మాట్లాడారని మంత్రి స్పష్టం చేశారు. కేరళకు అపార నష్టం వాటిల్లిందన్న సురేష్ ప్రభు రాష్ట్రాన్ని కష్టాల నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం అన్ని చర్యలూ తీసుకుంటోందని అన్నారు. పౌర విమానయాన శాఖ సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉందని ఆయన చెప్పారు. అలాగే కొచ్చిలోని నేవీ ఎయిర్‌పోర్టుకు రవాణా విమానాలు రాకపోకలు ప్రారంభమయ్యాయని ప్రభు వెల్లడించారు. భారీ వర్షాల వల్ల ఈ నెల 26 వరకూ కొచ్చి ఎయిర్‌పోర్టును మూసివేశారు. అయితే సహాయ సామగ్రిని తరలించేందుకు నావల్ ఎయిర్‌పోర్టుకు కార్గో విమానాల సర్వీసులు ప్రారంభమయ్యాయి.