జాతీయ వార్తలు

22నే బక్రీద్ సెలవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 20: బక్రీద్ సెలవు దినాన్ని ఈ నెల 22కు మారుస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని ప్రభుత్వ కార్యాలయాలకు గురువారం కాకుండా ఒకరోజు ముందే బుధవారం సెలవుదినం ఉంటుంది. చాంద్రమానం ఆధారంగా ఈ పండుగ నిర్ణయించే ఢిల్లీలోని షాహి ఇమాం సయ్యద్ అహ్మద్ బుఖారీ నేతృత్వంలోని కమిటీ రూయత్ హిలాల్ నిర్ణయం మేరకు ప్రభుత్వం ఈ మార్పు చేసింది. దేశంలో చంద్రుడు కనిపించే తీరు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా వుంటోందని, అందుకే ఢిల్లీలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కార్యాలయాలకు ఇదివరకు ప్రకటించిన ఆగస్టు 23న కాకుండా 22నే సెలవుదినం ప్రకటించడం జరిగిందని ప్రభుత్వం ఓ ప్రకటనలో వివరించింది.