జాతీయ వార్తలు

బౌద్ధమతం స్వీకరించిన 300 దళితుల బహిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిసార్, ఆగస్టు 20: బౌద్ధమతం స్వీకరించినందుకు దాదాపు 300 మంది దళితులను ఏడాదికి పైగా సాంఘిక బహిష్కరణ చేశారు. ఈ సంఘటన హర్యానాలోని హిసార్ జిల్లాలో వెలుగుచూసింది. భాట్లా గ్రామంలోని 300 మంది దళితులు బౌద్ధమతాన్ని స్వీకరించారు. దీనిని సహించలేని అగ్రవర్ణాలవారు వారిని ఏడాదిపాటు గ్రామ బహిష్కరణ విధించారు. ఈ విషయాన్ని ఇక్కడి గురు రవిదాస్ ఆలయంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న దళితుల హక్కుల పోరాట సంస్థ కన్వీనర్ రజత్ కల్సాన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి యమునానగర్, బల్లాభర్గ్ ప్రాంతాలకు చెందిన పలువురు దళితులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దళితులకు సాంఘిక బహిష్కరణ విధించినవారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందని రజత్ ఆరోపించారు.