జాతీయ వార్తలు

‘్భటీ బచావో-్భటీ పడావో’ లోగోతో నకిలీ వెబ్‌సైట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 20: కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రవేశపెట్టిన ‘్భటీబచావో-్భటీ పడావో’ పథకం లోగోతో ఒక నకిలీ వెబ్‌సైట్ ప్రజలను మోసం చేస్తోందని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మహిళ, శిక్ష సంక్షేమ శాఖ అధికారులు హెచ్చరించారు. తాము మహిళా, శిశు సంక్షేమ శాఖ భాగస్వామినని పేర్కొంటూ ఈ పథకం కింద 10 వేల రూపాయల లబ్ధి పొందాలనుకునే వారు తమ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, రిజిస్ట్రేషన్ కింద రూ.200 చెల్లించాలని ఈ నకిలీ వెబ్‌సైట్ ప్రజలను మోసం చేస్తోంది. ఈ పథకం కింద తాము ఎలాంటి ప్రకటన చేయలేదని, ప్రజలెవ్వరూ దీనికి దరఖాస్తు చేసి మోసపోవద్దని కేంద్ర మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. www.wcd.nic.in మాత్రమే ఈ పథకానికి సంబంధించిన అధికారికమైన వెబ్‌సైట్ అని వారు స్పష్టం చేశారు. కాగా నకిలీ వెబ్‌సైట్ సృష్టికర్తలను గుర్తించామని, ఐటి యాక్టు కింద వారిపై కేసు నమోదు చేశామని, నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.