జాతీయ వార్తలు

భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు కొత్త వీసా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 20: భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని భారత్‌లో న్యూజిలాండ్ రాయబారి జొన్నా కెంప్‌కెర్స్ వెల్లడించారు. ప్రతి ఏటా దాదాపు 20వేల మంది భారతీయ విద్యార్థులు తమ దేశంలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వస్తున్నారని, వారి సంఖ్యను మరింత పెంచేందుకు మూడేళ్ల కాలానికి పోస్ట్-స్టడీ వర్క్ వీసాను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. సోమవారం ఢిల్లీలో జరిగిన ‘న్యూజిలాండ్-ఇండియా అకడమిక్’ సదస్సులో ఆమె మాట్లాడారు. భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని గ్రాడ్యుయేట్, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ వంటి ఉన్నత చదువులకోసమే కొత్తగా మూడేళ్ల వీసా విధానాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు.