జాతీయ వార్తలు

‘ఎ’ అంటే ‘అసోం’ అనాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంగపర, మార్చి 27: అసోంలో పరివర్తనా పవనాలు బలంగా వీస్తున్నాయని, ఈ పవనాలు కాంగ్రెస్‌ను, దాని 15 ఏళ్ల దుష్టపాలనను కూల్చివేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం రాష్ట్రంలోని రంగపరలో జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడుతూ, గత అరవై ఏళ్లలో అసోంకోసం ఏం చేశామో కాంగ్రెస్ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల రోజున అభివృద్ధికోసం సరయిన మీట నొక్కండి. అప్పుడు జనం ‘ఎ’ అంటే ‘అసోం’ అని అంటారు అని మోదీ చెప్పారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా స్పష్టమైన తీర్పు ఇచ్చారని, ఇప్పుడు భారత దేశానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని ఆయన అంటూ, అసోం కోసం కూడా అలాంటి ప్రశంసలే వినాలనుకుంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, దాని మిత్రపక్షాలకు సంపూర్ణ మెజారిటీ ఇవ్వాలన్నారు.
‘ఈ ప్రాంతానికి లభించాల్సిన ప్రాధాన్యత ఎందుకు లభించలేదు? అసోంను పేద రాష్ట్రంగా ఎవరు చేశారు? అసోంను అభివృద్ధి చేయడం ద్వారా మీ ప్రేమకు రుణాన్ని తిరిగి తీర్చుకుంటాను’ అని మోదీ అన్నారు. గత అయిదు మేనిఫెస్టోల్లో కాంగ్రెస్ పార్టీ తన హామీలను కిందా మీదా చేసిందే తప్ప కొత్తవేమీ చేయలేదు. అంతేకాదు చేసిన హామీలనూ నెరవేర్చలేదు. 15ఏళ్లపాటు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌పై విశ్వాసం ఉంచారు. అయితే వాళ్లు రాష్ట్ర ప్రజలకు, వారి ఆకాంక్షలకు ద్రోహం చేశారు. కళ్లు కనిపించని గుడ్డివాడు కూడా ఒక రోడ్డుకు కాంక్రీట్ వేశారో లేదో సులభంగా చెప్పగలడు అదే విధంగా రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందో లేదో ఎవరైనా చెప్తారు’ అని ప్రధాని అన్నారు. ‘అంతేకాదు, బ్యాంకుల తలుపులు సంపన్నులకు మాత్రమే తెరుచుకుంటున్నాయి. బ్యాంకులను జాతీయం చేసినప్పుడు పేదలకోసమే ఆ పని చేసినట్లు చెప్పారు. అయితే పేదలకు ఒరిగిందేమీ లేదు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత స్క్రూలు బిగించాను. బ్యాంకులనుంచి దోచుకున్న సొమ్ము వెనక్కి వచ్చేలా చూశాను. బ్యాంకుల తలుపులను పేదలకోసం తెరిచాను’ అని నరేంద్ర మోదీ చెప్పారు. అభివృద్ధి, శరవేగంగా, అన్నిచోట్లా అభివృద్ధి అనే అజెండాలపై తాము పని చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ‘2022 నాటికి దేశంలోని ప్రతి ఒక్కరికీ వారి సొంత ఇల్లు ఉంటుంది. ఈ ప్రాంతం అభివృద్ధికోసం మేము 2 వేల కోట్ల రూపాయలకు పైగానే ఖర్చు చేస్తాం’ అని ఆయన చెప్పారు. శనివారం రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో నాలుగు ఎన్నికల ర్యాలీల్లో ఒక పౌర సమావేశంలో మాట్లాడడం ద్వారా ప్రధాని భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అసోంలోని 126 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 4, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.