జాతీయ వార్తలు

మీరు జీవితాంతం గురువులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: ఉపాధ్యాయ వృత్తి అత్యుత్తమైనదని, కేవలం ఉద్యోగ వయోపరిమితి కాలంతో వారి బాధ్యత ముగిసిపోదని, వారి జీవితాంతం వారు ఉపాధ్యాయులుగా బాధ్యత వహిస్తారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులతో ఆయన మంగళవారం నాడిక్కడ ఇష్టాగోష్టి జరిపారు. విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభాపాటవాలను వెలికితీసి, జీవిత పాఠాలూ నేర్పి వారిని అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ఆయన అవార్డు గ్రహీత ఉపాధ్యాయులకు సూచించారు. విద్యా బోధనలో నాణ్యతను, విలువలను పెంపొందించడం ద్వారా ప్రసంశలు అందుకున్నందుకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా పాఠశాల విద్యాబోధన మరింత పటిష్టవంతంగా సాగేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రత్యేకించి ఉపాధ్యాయులు విద్యార్థులతో సమున్నతమైన అనుబంధాన్ని ఏర్పరచుకోవాలని, తద్వారా విద్యార్థులు వారు జీవించివున్నంత వరకు ఉపాధ్యాయుల ఔన్నత్యాన్ని గుర్తుంచుకుంటారన్నారు. పాఠశాలల్లోనూ, పరిసర ప్రాంతాల్లోనూ డిజిటల్ విధానాన్ని అనుసరించాలని సూచించారు.

చిత్రం..ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి జావడేకర్