జాతీయ వార్తలు

జవాన్లకు స్మార్ట్ ఫోన్లిస్తే మేలు యాప్‌ల ద్వారా విస్తృత సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: ఆర్మీ జవాన్లకు స్మార్ట్ ఫోన్ల వినియోగించడానికి అనుమతి ఇస్తే బాగుంటుందని, సామాజికమాధ్యమాలను మానసిక యుద్ధతంత్రం ద్వారా ప్రచ్ఛన్న యుద్ధాన్ని, చొరబాటుదాలు, టెర్రరిజంపై రాజీలేని పోరు చేసేందుకు వీలవుతుందని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అన్నారు. ఆర్మీ ప్రధాన కార్యాలయాన్ని పునర్మిర్మాణం చేస్తున్నట్లు చెప్పారు. అన్ని స్థాయిలో సామాజిక మాధ్యమాలతో అనుసంధానం అవసరమని ఆయన చెప్పారు. సైనికుల సంక్షేమం కోసం యాప్‌ను రూపొందించామన్నారు. స్మార్ట్ఫోన్ల వినియోగానికి అనుమతి లేకుండా ఈ తరహా ఫీచర్లను సేవలను ఎలా పొందగలరన్నారు. టెక్నాలజీతో పాటే ఆర్మీ జవాన్లు కూడా పోటీతత్వంతో పనిచేసే పరిస్థితులను కల్పించాలన్నారు. ఆర్మీ జవానులు, స్మార్ట్ఫోన్లు అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, సామాజిక మాధ్యమాల ద్వారా మానసికయుద్ధతంత్రం విధానాలను, ఎత్తుగడలను అమలు చేయవచ్చన్నారు. ఉగ్రవాదులు, చొరబాటుదారులను తరిమిగొట్టేందుకు ఆర్మీ జవాన్లు నిరుపమానమైన సేవలుఅందిస్తున్నారన్నారు. ఆర్మీతో పాటు అన్ని విభాగాలకు సామాజిక మాధ్యమం నిజజీవితంలో, విధుల్లో భాగమయ్యాయన్నారు. ఆర్మీ జవాన్లు నిర్వహిస్తున్న సున్నితమైన విధుల నిర్వహణ వల్ల వారికి స్మార్ట్ఫోన్ల వినియోగానికి అనుమతి లేదన్నారు. వీటిని ఎలా ఉపయోగించాలో కూడా తెలియచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్మీ జవాన్ల కోసం ఆర్పాన్ అనే మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దీని ద్వారా ఆర్మీ జవాన్ల కుటుంబ సభ్యులు సమస్యలు తెలియచేసేందుకు వీలవుతుందన్నారు. మన జవాన్ల సంక్షేమానికి సొంతంగా యాప్స్‌ను రూపొందిస్తున్నప్పుడు స్మార్ట్ఫోన్ల ఉపయోగించరాదని ఎలా చెప్పగలమన్నారు.