జాతీయ వార్తలు

లాలూకి ప్రభుత్వాసుపత్రిలో బాధలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచి/పాట్నా, సెప్టెంబర్ 4: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ వ్యవస్థాపకులు లాలూ ప్రసాద్ యాదవ్ గురించి తెలియనివారుండరు. వివిధ అవినీతి కేసుల్లో జైలు శిక్షను అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ రాంచిలో అనారోగ్యంతో రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆప్ మెడికల్ సైనె్సస్ (రిమ్స్) చేరారు. లాలూజీ ఉన్న ఆసుపత్రి వార్డులోకి వీధి కుక్కలువచ్చేస్తున్నాయి. దోమలబెడద పెరిగింది. పరిశుభ్రత అధ్వాన్నం.
వీధి కుక్కలు రావడమే కాకుండా పోట్లాడుకుంటున్నాయి. వాటి అరుపులతో ఆస్పత్రిదద్దరిల్లుతోంది. తనను ప్రస్తుతం ఉన్న వార్డు నుంచి పేమెంట్ వార్డుకు బదలాయించాలని జైలు అధికారులను లాలూజీ కోరారు. ఈ వివరాలను ఆర్జేడీ ప్రధాన కార్యదర్శి బోలా యాదవ్ చెప్పారు. రిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్‌గా దరఖాస్తు చేశామన్నారు. ఇప్పటికే రకరకాల ఇనె్ఫక్షన్లతో లాలూజీ బాధపడుతున్నారు. పైగా పోస్ట్‌మార్టమ్ రూం గది కూడా పక్కనే ఉంది. దోమల బెడద తీవ్రంగా ఉంది. టాయిలెట్లలో పైపులు పగిలిపోయి దుర్గంధం వెలువడుతోంది. దీంతో లాలూజీ తీవ్రంగా బాధపడుతున్నారని ఆర్జేడీ నేత బోలా యాదవ్ చెప్పారు. లాలూ ప్రసాద్ మదుమేహంతో బాధపడుతున్నారన్నారు. కొత్తగా నిర్మించిన వార్డుల్లో పేమెంట్ రూంలు ఉన్నాయని, అక్కడకు తరలిస్తే, అద్దె చెల్లిస్తామని చెప్పామన్నారు. బెయిల్ ముగియడంతో గత నెల 30వ తేదీన లాలూప్రసాద్ లొంగిపోయారన్నారు.
ఇటీవలనే ముంబాయి ఆసుపత్రిలో లాలూజీ ఫిస్టులా ఆపరేషన్ చేసుకున్నారు. కిడ్నీ సమస్యలు కూడా వచ్చినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. కాగా ఆసుపత్రిలో వీధి కుక్కల గోల చేస్తున్నాయని, దోమల బెడద తీవ్రమైందని లాలూప్రసాద్ అనుచరులు చేసిన వ్యాఖ్యలపై అధికారంలో ఉన్న జేడీయూ మండిపడింది. లాలూజీ కుటుంబం పదేళ్లపాటు బిహార్‌ను పాలించిందని గుర్తు చేశారు. మీరు అధికారంలో ఉండగా, ప్రజలు అలాగే బాధపడ్డారనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని జేడీయూ నేతలంటున్నారు. లాలూజీ పదిహేనేళ్ల పాలనలో క్రైమ్ రేట్లు ఎలా పెరిగాయో గుర్తు చేసుకోవాలని జేడీయూ ఎమ్మెల్సీ నీరజ్ కుమార్ ఎద్దేవా చేశారు.