జాతీయ వార్తలు

ప్రధాని విదేశీ పర్యటన వివరాలు వెల్లడించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: ప్రధాని నరేంద్రమోదీ వెంట విదేశీ పర్యటనల్లో పాల్గొన్న ప్రైవేట్ వ్యక్తుల వివరాలను వెల్లడించాలని సమాచార హక్కు కమినర్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిని ఆదేశించించారు. 2015-16 నుంచి 2016-17 మధ్య ప్రధాని నరేంద్రమోదీ విదేశీ పర్యటనలకు అయిన ఖర్చు వివరాలను అందించాలని కోరుతూ కరాబీ దాస్ అనే వ్యక్తి కేంద్ర మంత్రిత్వశాఖను ఆశ్రయించారు. గత అక్టోబర్‌లో ఆయన ఈ దరఖాస్తు చేశారు. మోదీ వెంట ఈ పర్యటనల్లో పాల్గొన్న వారి వివరాలు కూడా కావాలని అడిగారు. ఇంతవరకు తనకు సరైన సమాధానం రాకపోవడంతో విసుగుచెంది సమాచార కమిషన్‌ను ఆశ్రయించినట్లు ఆయన చెప్పారు. రూ.224 సొమ్మును డిపాజిట్ చేయాలని కూడా మంత్రిత్వ శాఖ కోరినట్లు చెప్పా రు. సుబాష్ అగర్వాల్ అనే వ్యక్తి ఈ సొమ్మును డిపాజిట్ చేశారు. పర్యటనల్లో పాల్గొన్న వారి వివరాలు అడిగితే, ఎటువంటి డాటాను మెయింటైన్ చేయడం లేదని బదులిచ్చినట్లు సమాచార కమిషనర్ మాథూర్‌కు తెలియచేశారు. ఈ పిటిషన్‌పై అందుబాటులో ఉన్న సమాచారాన్ని వెంటనే అందించాలని ఆర్‌టీఐ కమిషనర్ ఆర్‌కే మాథూర్ ఆదేశించారు.