జాతీయ వార్తలు

బ్రహ్మపుత్రలో నావ బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, సెప్టెంబర్ 5: బ్రహ్మపుత్ర నదిలో జరిగిన నావ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. 11 మంది గల్లంతయ్యారు. ఒక మోటారు నావ నదిలో ఒక రాతి శిలను ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పది మందిని రక్షించినట్లు, మరో 12 మంది క్షేమంగా ఒడ్డుకు చేరారని అధికారులు తెలిపారు. కామరూప్ డిప్యూటీ కమిషనర్ కమల్ కుమార్ బైశ్యా మాట్లాడుతూ ఈ మోటారు నావ ఫ్యాన్సీ బజార్ ఘాట్ నుంచి 36 మంది ప్రయాణీకులతో మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరింది. ఈ నావలో 18 మ ఒటారు సైకిళ్లు కూడా ఉన్నాయని చెప్పారు. 22 మంది ప్రయాణీకులకు మాత్రమే టిక్కెట్లు ఉన్నాయన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే గల్లంతైన వారి కోసం రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలు రంగంలోకి దిగాయి. ఇంతవరకు లభించిన మూడు మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. ఈ ఘటనలో వర్శిటీ విద్యార్థిని మరణించింది. బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతంలో గల్లంతైన వారి కోసం మమ్మురంగా గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే బ్రహ్మపుత్ర నదిలో లాంచీలు, మర పడవల రాకపోకలను సస్పెండ్ చేశారు.