జాతీయ వార్తలు

మోదీ-అంబానీ మధ్య రహస్య ఒప్పందం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ దాడిని మరింత అధికం చేసింది. రాఫెల్ ఒప్పందంలో ప్రధాని నరేంద్రమోదీ, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ మధ్య రహస్య ఒప్పందం జరిగిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి ఆరోపించారు. ఈ ఒప్పందం లోని కుంభకోణాన్ని ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో నిర్వహించిన సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వ హయాంలో కుదిరిన ఒప్పందం ప్రకారం చూస్తే ఇప్పుడు జరిగిన ఒప్పందంలో వాస్తవ ధరకన్నా 4,1,205 కోట్లు అనగా, ఒక్కో విమానానికి 1100 కోట్లు అదనంగా చెల్లిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ ఒప్పందం మేరకు ఒక ప్రైవేట్ కంపెనీతో విమానాల తయారీలో సహకారం సాధ్యం కాకపోయినప్పటికీ మోదీ, అనీల్ అంబానీ రహస్య ఒప్పందం కుదుర్చుకుని వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఈ డీల్‌లో అప్పటి రక్షణ మంత్రి పారికర్, ఫారిన్ సెక్రటరీని పక్కన పెట్టడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ డీల్‌కు 12 రోజుల ముందు కేంద్ర ప్రభుత్వ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ను పక్కన పెట్టి సాంకేతిక పరిజ్ఞాన బదిలీపై అంబానీ కంపెనీ, ఫ్రెంచ్ కంపెనీ మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. 12 రోజుల ముందే అంబానీ తన కంపెనీని సైతం రిజిస్టర్ చేశారన్నారు. విమానాల కాన్ఫిగరేషన్ గతంలో కుదుర్చుకున్న విధంగానే ఉంటుందని 2015లో ప్రధాని మోదీ పేర్కొన్నారని, అలాంటప్పుడు అదనపు మిస్సయిల్స్, సాంకేతిక పరిజ్ఞానం, ఏక్సెసరీస్ ఇలా ఏమి అదనపుసౌకర్యాలు జోడించారని మీరు వాటి ధర అనూహ్యంగా పెంచి ఒప్పందం కుదుర్చుకున్నారని జైపాల్ రెడ్డి ప్రశ్నించారు. ఇలావుండగా కాంగ్రెస్ ఆధార రహిత ఆరోపణలు చేసి తమ కంపెనీ పరువుతీస్తోందని రిలయన్స్ కంపెనీ ఇప్పటికే ఆ పార్టీకి లీగల్ నోటీసులు జారీ చేయగా, రాఫెల్ కుంభకోణాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని కాంగ్రెస్ పార్టీ పెద్దయెత్తున కార్యక్రమాన్ని చేపట్టింది.