జాతీయ వార్తలు

ఎరుపెక్కిన దేశ రాజధాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: దేశ రాజధాని న్యూఢిల్లీ నగరం బుధవారం నిరసన ప్రదర్శనలతో హోరెత్తిపోయింది. వామపక్ష పార్టీల మద్దతుతో భారీ ర్యాలీతోపాటు, పార్లమెంటు ముట్టడికి ప్రయత్నించిన కార్మికులు, కర్షకులను అదుపుచేయడానికి భద్రతా బలగాలు నానా ఇబ్బంది పడ్డారు. లెఫ్ట్ పార్టీల జెండాలతో న్యూఢిల్లీ ఎరుపెక్కింది. వేలాది మంది మహిళలు సైతం నిరసన ప్రదర్శన నిర్వహించడం విశేషం. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నిలువరించేందుకు నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ఎన్డిఏ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వివిధ మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. వర్షాన్నీ, రోడ్లపై నిలిచిన నీటిని లెక్కచేయకుండా మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు. అఖిల భారత రైతు సభ (ఏఐకేఎస్)తోపాటు సీఐటీయూ కూడా మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించడంతో, కర్షకులు, కార్మికులతో రాజధాని నగర వీధులు నిండిపోయాయి. రాంలీలా మైదానంలో జరిగిన సభలో సుమారు మూడు లక్షల మంది రైతులు, కార్మికులు పాల్గొన్నారు. అనంతరం వారు పార్లమెంటు రోడ్డుపై కవాతు చేశారు. పార్లమెంటును ముట్టడించేందుకు చేసిన ప్రయత్నాలను భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. గిట్టుబాటు ధరలు, గిడ్డంగుల వసతి సౌకర్యాలు, రుణ మాఫీ, ప్రకృతి వైపరీత్యాల సమయంలో పరిహారం వంటి పలు అంశాలను రైతులు ప్రస్తావించారు. ఈ సమస్యలను తీర్చకపోతే, పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని మోదీ సర్కారును హెచ్చరించాయి. కాగా, తమ సమస్యలపై వెంటనే స్పందించాలని కార్మికులు డిమాండ్ చేశారు. 18,000 రూపాయల కనీస వేతనాన్ని నిర్ధారించాలని కోరారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిసహా వివిధ పార్టీలు, సంఘాలు, సంస్థల నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. దేశంలో కార్మికులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పరిస్థితి ఇలాగే ఉంటే, ప్రజాగ్రహానికి గురికాక తప్పదని ఎన్టీఏ సర్కారుకు స్పష్టం చేశారు.