జాతీయ వార్తలు

క్రీడాకారులకు వందనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: ఆసియా క్రీడోత్సవాల్లో మన క్రీడాకారులు సాధించిన పతకాల మూలంగా ప్రపంచంలో భారతదేశం స్థాయి, గౌరవం పెరిగిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఆసియా క్రీడోత్సవాల్లో పతకాలు సాధించిన యువ క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించటంపై దృష్టి కేంద్రీకరించాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఆసియా క్రీడలకు హాజరయ్యేందుకు కొందరు క్రీడాకారులు పడ్డ కష్టాలను తలచుకుంటూ నరేంద్ర మోదీ కంట తడిపెట్టారు. నరేంద్ర మోదీ బుధవారం తమ అధికార నివాసంలో 18వ ఆసియా క్రీడాత్సవాల్లో పతకాలు సాధించిన క్రీడాకారులతో ఇష్టాగోష్టి జరిపారు. ఇండోనేషియాలోని జకర్తా, పలెంబాంగ్‌లో ఇటీవల జరిగిన ఆసియా క్రీడోత్సవాల్లో భారతదేశం మొత్తం 69 పతకాలు సాధించటం తెలిసిందే. 2010 చైనాలోని గంగజౌవ్‌లో జరిగిన ఆసియా క్రీడోత్సవాల్లో భారతదేశం అత్యధికంగా 65 పతకాలు సాధిందించి. 18వ ఆసియా క్రీడోత్సవాల్లో మన క్రీడాకారులు 65 పతకాల రికార్డును అధిగమించి 69 పతకాలను సాధించటం ద్వారా కొత్త రికార్డును నెలకొల్పారు. ప్రధాని ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడాకారులు తమ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఆధునిక సంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఆసియా క్రీడోత్సవాల్లో పతకాలు సాధించిన క్రీడాకారులందరినీ పేరుపేరునా అభినందించారు. ‘మీరు చిత్తశుద్ధి, పట్టుదలతో చేసిన కృషి మూలంగా ఆసియా క్రీడల్లో భారత దేశం మొదటిసారి అత్యధిక పతకాలు సాధించిందని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆసియా క్రీడల్లో మీరు సాధించిన ఘనవిజయాల మూలంగా దేశం పరువు, ప్రతిష్ట మరింత ఇనుమడించాయని అన్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులు కీర్తి, పొగడ్తల్లో మునిగిపోకుండా నేలమీదే ఉండాలి.. క్రీడలపై మరింత దృష్టి కేంద్రీకరించి మరిన్ని విజయాలు సాధించాలని మోదీ హితవు చెప్పారు. పొగడ్తలకు లొంగిపోతే క్రీడలపై ఏకాగ్రత తగ్గుతుందని హెచ్చరించారు. క్రీడాకారులు తమ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని ప్రధాన మంత్రి సూచించారు. క్రీడా సామర్థ్యాన్ని విశే్లశించి లోపాలను సరిదిద్దుకోవటం ద్వారా సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలన్నారు. ప్రపంచంలోని ఉత్కృష్ట క్రీడాకారులతో తమను తాము పోల్చుకోవటం ద్వారా సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కృషి చేయాలని మోదీ సూచించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, గ్రామీణ ప్రాంతాలు, చిన్న, చిన్న పట్టణాలకు చెందిన యువతీ, యువకులు క్రీడల్లో రాణించటం, తమ సామర్థ్యం ద్వారా పతకాలు సాధించటం పట్ల నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోనే నిజమైన సామర్థ్యం దాగి ఉన్నది, వీరికి తగిన ప్రోత్సాహకాలు కలిగించటం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చునని అన్నారు. మన దేశంలోని క్రీడాకారులు రోజూ పడే బాధల గురించి బయటి ప్రపంచానికి ఎంతమాత్రం తెలియదని నరేంద్ర మోదీ అన్నారు. దేశానికి పతకాలు సాధించేందుకు కొందరు క్రీడాకారులు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ప్రస్తావిస్తూ నరేంద్ర మోదీ కంట తడిపెట్టారు. అష్టకష్టాలు ఎదురైనా ధైర్యం, మొండి పట్టుదలతో పతకాలు సాధించిన క్రీడాకారులకు ఆయన వందనం చేశారు. యువ క్రీడాకారులు సాధించిన విజయాలు ఇతరులకు స్పూర్తి కావాలని అభిలషించారు. ఆసియా క్రీడోత్సవాల్లో పతకాలు సాధించిన క్రీడాకారుల అసలు పరీక్ష ఇప్పుడే ప్రారంభం అవుతుంది.. లక్ష్యంనుండి దృష్టి మరల్చకుండా ఒలింపిక్స్‌పై దృష్టి పెట్టాలని హితవు చెప్పారు.
కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి కల్నల్ రాజ్యవర్థన్ రాథోడ్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి దూరదృష్టి, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ మూలంగానే పతకాల సంఖ్య పెరిగిందని, యువ క్రీడాకారులకు సముచిత స్థానం లభించిందని చెప్పారు.

చిత్రం..ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని నరేంద్ర మోదీ, క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్