జాతీయ వార్తలు

మాతృభాషలోనే విద్యాబోధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: ప్రాథమిక విద్యాభోదన మాతృభాషలోనే జరగాలని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా బుధవారం విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో 2017 సంవత్సరానికి రాష్ట్రపతి ఉపాధ్యాయ అవార్డులను ఆయన బహూకరించారు. దేశాభివృద్ధికి ఉపాధ్యాయులు మూలస్తంభాలని ఆయన చెప్పారు. వారు చేస్తున్న కృషి మూలంగానే విద్యారంగం దినదినాభివృద్ధి చెందుతోందని, ఉన్నత స్థాయిని అందుకుంటోందని వెంకయ్య ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలోని ఇతర దేశాలు భారతదేశాన్ని విశ్వగురువుగా గుర్తించాయని మనదేశంలో వేలాది సంవత్సరాల నుండి విజ్ఞాన సముపార్జన జరుగుతోందని ఉప రాష్ట్రపతి చెప్పారు. మన దేశంలో వేలాది సంవత్సరాల నుండి విజ్ఞాన సముపార్జన జరుగుతున్నా ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు, యువకులు, పెద్దలకు నాణ్యమైన విద్యను అందజేయలేకపోతున్నామని వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మన సమాజం ఆలోచనా విధానం, అభిప్రాయం మారవలసిన అవసరం ఎంతో ఉన్నదని, విద్యాభ్యాసానికి విలువ ఇచ్చే సంస్కృతి నెలకొనాలని ఆయన అభిలషించారు. ఉపాధ్యాయులను గౌరవించడంతోపాటు విద్యాభ్యాసాన్ని గౌరవించే సంస్కృతి నెలకొంటేనే మన విద్యావ్యవస్థ బాగుపడుతుందని అన్నారు. విలువలను పెంచుకోవాలి తప్ప వాటిని నేర్చుకోవటం సాధ్యం కాదని, ఉపాధ్యాయులు తమ వ్యవహారశైలి, ప్రవర్తన, విద్యార్థులతో మాట్లాడే విధానాల ద్వారా వారిలో విలువలు పెంచాలని నాయుడు సూచించారు. సమభావం, ప్రజాస్వామ్యం, శాంతి, కలిసికట్టుగా పని చేయటం వంటి విలువలను విద్యార్థులకు నేర్పించాలన్నారు. ఫిన్లాండ్ తదితర దేశాల్లో ఉపాధ్యాయులకు అత్యధిక విలువ, గౌరవం లభిస్తోందని, వ్యక్తిత్వం, శీలాన్ని పెంచే విద్యావిధానం కావాలని అన్నారు. శీలాన్ని పెంచటంతోపాటు మేధస్సును పటిష్టం చేసే విద్యావిధానం అవసరమన్న స్వామి వివేకానంద మనందరికి ఆదర్శం కావాలని వెంకయ్య నాయుడు సూచించారు. విద్యా ప్రమాణాలు పెంచాలి, ఉపాధ్యాయులకు తమ వద్ద విద్య నభ్యసించే ప్రతి విద్యార్థి తెలిసి ఉండాలి, విద్యార్థుల అవసరాల మేరకు విద్యను భోదించగలిగే సామర్థ్యం ఉపాధ్యాయులకు ఉండాలని వెంకయ్య నాయుడు చెప్పారు. వినేది వెంటనే మరిచిపోతాం.. కానీ చూసిన దానిని జ్ఞాపకం ఉంచుకంటామని, అందుకే ప్రయోగాలతో కూడిన విద్య అవసరమని అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ కలలు కన్న కొత్త విద్యా విధానం అమలులోకి రావాలని అన్నారు. తెలంగాణణాకు చెందిన బేగంపేట కేంద్రీయ విద్యాలయానికి చెందిన నడుపల్లి శేషప్రసాద్, జోగులాంబ గద్వాల్ జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యయుడు బీఎస్ రవి, నిజామాబాద్ జిల్లాలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు నర్రా రామారావు, వరంగల్ జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడు బండారి రమేష్, ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని నివేదిత కిశోర్ విహార్ పాఠశాల ఉపాధ్యాయురాలు మేకా సుసత్య రేఖకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు లభించాయి. వీరితోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ఉప రాష్ట్రపతి బహూకరించారు.