జాతీయ వార్తలు

విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయాలి : మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలని జాతీయ ఉత్తమ అవార్డులు స్వీకరించిన ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు నుంచి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు తీసుకున్న వారు ప్రధానిని లాంఛనంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యయ వృత్తిని మించినది మరొకటి లేదని అన్నారు. ఉపాధ్యాయ వృత్తికి వనె్న తెచ్చిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితాన్ని మార్గదర్శకంగా చేసుకోవాలన్నారు. మారుమూల గ్రామాల పిల్లలకు కూడా ఉత్తమ విద్య అందేలా చూసే బాధ్యతను ఉపాధ్యాయులు స్వీకరించాలని చెప్పారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో బుధవారం జాతీయ అవార్డులను ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు నుంచి స్వీకరిస్తున్న మేకా సుసత్య రేఖ (రాజమండ్రి), శేష ప్రసాద్ నడుపల్లి (హైదరాబాద్), బీఎస్ రవి (జోగులాంబ గద్వాల్ జిల్లా), నర్రా రామారావు (నిజామాబాద్), బండారి రమేష్ (వరంగల్).
చిత్రంలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్.