జాతీయ వార్తలు

డబ్ల్యూహెచ్‌ఓ రీజినల్ డైరెక్టర్‌గా పూనమ్ రెండోసారి ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆసియా ఈశాన్య ప్రాంత డైరెక్టర్‌గా డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ రెండో దఫా నామినేట్ అయ్యారు. మరో ఐదేళ్లపాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ప్రాంతం నుంచి ఈ పదవికి ఎంపికైన తొలిమహిళ ఈమే కావడం గమనార్హం. పదకొండు దేశాల సభ్యత్వం ఉన్న డబ్ల్యూహెచ్‌ఓ రీజినల్ కమిటీ బుధవారం సమావేశమై ఈ మేరకు కొత్తగా గ్లోబల్ హెల్త్ బాడీని, రీజినల్ డైరెక్టన్‌ను ఎంపిక చేసిందని, డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ అభ్యర్థిత్వం పట్ల ఎవ్వరూ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ట్విట్టర్‌లో ఆమెకు అభినందనలు తెలిపారు. ప్రపంచ దేశాల్లో, ప్రత్యేకించి ఆసియా ఈశాన్య దేశాల్లో వ్యాధిపీడిత ప్రాంతాలకు సేవలందించడంలో ఆమె తన ప్రత్యేకతను చాటుకోవాలని మంత్రి నడ్డా ఆకాంక్షించారు. కాగా డబ్ల్యూహెచ్‌ఓ) కార్యనిర్వాహక బోర్డు తదుపరి సమావేశం జనీవాలో వచ్చే జనవరి 2019లో జరుగనుంది. అందులో పూనమ్‌ఖేత్రపాల్ సింగ్ నామినేషన్‌ను ఖరారు చేయడం జరుగుతుంది. ఆమె 2019 ఫిబ్రవరి 1 నుంచి డైరెక్టర్‌గా రెండోదఫా బాధ్యతలను ప్రారంభిస్తారు. ప్రపంచంలో నాల్గవ వంతు ప్రజలు అనుభవిస్తున్న వ్యాధుల బాధలను గుర్తించి సేవలందించడంలో పూనమ్ అసమాన ప్రతిభను కనబరిచారని, వాటిని ముందుకు సాగించాల్సివుందని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రాస్ అధానమ్ గేబ్రియేసస్ పేర్కొన్నారు. ప్రస్తుత డైరెక్టర్ పదవిని ఆమె 2014 ఫిబ్రవరి 1న చేపట్టినప్పటి నుంచి డబ్ల్యూహెచ్‌ఓ ఆశయాలను అమలు చేసేందుకు శక్తివంచన లేకుండా కృషిచేశారని ప్రశంసించారు. సభ్య దేశాలన్నింటినీ సంప్రదించి అక్కడ చేపట్టాల్సిన కార్యక్రమాల ప్రాధాన్యతలను రూపొందించారన్నారు. మాతా, శిశు మరణాల నియంత్రణపై ఆమె ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారని, ట్యూబర్‌కులోసిస్ (టీబీ)ని పూర్తిగా అరికట్టాలని ఆమె తన 8వ ప్రాధాన్యతను గత ఏడాది నిర్ధేశించారన్నారు. భారత పరిపాలనా విభాగాల్లో పనిచేస్తున్నపుడు, అలాగే బ్యాంకు అధికారిగా ఉన్నపుడు డాక్టర్ పూనమ్ ఇప్పటి వరకు ఆరోగ్య రంగంలో వివిధ ఉన్నత పదవుల్లో కొనసాగారు. జనీవాలోని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ కేబినెట్‌లోనూ, కార్యనిర్వాహక డైరెక్టర్‌గానూ ఆమె పనిచేశారు.