జాతీయ వార్తలు

కోల్‌కతాలో కూలుతున్న వంతెనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: కోల్‌కొతా నగరంలో వంతెనలు కూలడం పరిపాటిగా మారింది. ముందుగా ఎన్ని హెచ్చరికలు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. అధికార యంత్రాంగం నిర్లప్తత, నిర్లక్ష్యం కూడా కారణాలని అంటున్నారు. కాగా, తాజాగా కూలిన మాజేర్హాట్ వంతెనతో పాటు పలువంతెనలు బలహీనంగా ఉన్నాయని, వీటికి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ఆధీనంలోని ఇంజనీరింగ్ అండ్ కనె్సల్టెన్సీ ఏజన్సీ రైట్స్ నివేదికలో పేర్కొంది. 2016లో సమర్పించిన నివేదికలో బలహీనంగా ఉన్న వంతెనల అంశాలను ప్రస్తావించామని ఆ సంస్థ పేర్కొంది. కాని ప్రభుత్వం ఈ నివేదిక సిఫార్సులను పట్టించుకోలేదు. ఈ వివరాలను రైట్స్ అధికార వర్గాలు వెల్లడించాయి. బ్యూరోక్రసీ ఉదాసీనత వైఖరి వల్ల మజేర్హాట్ వంతెన మరమ్మత్తు పనులు ఆలస్యమయ్యాయి ఈ వంతనెనను డైమండ్ హార్బర్ రోడ్డులో 50 ఏళ్ల క్రితం నిర్మించారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించారు. అనేక మందికి గాయాలయ్యా యి. కూలిన వంతెన మరమ్మతుకు ప్రభుత్వం ఇటీవల టెండర్లు కూడా పిలిచంది. 2016లో నగరంలో వివేకానంద ఫ్లైవోవర్ కూలింది. అనంతరం రైల్ ఇం డియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (రైట్స్)తో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అన్ని వం తెనల పరిస్థితిని అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. కోల్‌కొతా నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ మాజీ డీజీ దీపాన్కర్ సిన్హా మాట్లాడు తూ పీడబ్ల్యుడీ శాఖకు వంతెనలను మరమ్మతు చే యాలని అనేక సార్లు కోరినా పట్టించుకోలేదన్నారు.

చిత్రం..జోరుగా సాగుతున్న మాజేర్హాట్ వంతెన మరమ్మతు పనులు