జాతీయ వార్తలు

తమిళనాడును కుదిపేసిన గుట్కా కుంభకోణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో గుట్కా కుంభకోణం అధికార పార్టీ పునాదులను కదిలిస్తోంది. ఈ స్కామ్‌కు సంబంధించి రాష్ట్ర మంత్రి, పోలీస్ ఉన్నతాధికారి అయిన డీజీపీ, మాజీ డీజీపీ గృహాలపై సీబీఐ దాడులు నిర్వహించడం సంచలనం కలిగించింది. కోట్ల రూపాయలతో ముడిపడి ఉన్న ఈ గుట్కా స్కామ్‌కు సంబంధించి తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సి.విజయభాస్కర్, డీజీపీ టీకే రాజేందర్, మాజీ డీజీపీ ఎస్.జార్జి ఇళ్లతో సహా రాష్ట్రంలోని 40చోట్ల సీబీఐ దాడులు నిర్వహించింది. వాణిజ్య పన్ను, ఆహార భద్రత శాఖ అధికారులు కూడా ఈ దాడుల్లో పాల్గొన్నారు. బుధవారం ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైన ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఆదాయపు పన్ను శాఖ అధికారులు గుట్కా, పాన్‌మసాలా తయారీ కంపెనీకి సంబంధించిన ఒక గోడౌన్‌పై దాడులు నిర్వహించినప్పుడు గుట్కా స్కామ్ జూలై 7, 2017లో వెలుగులోకి వచ్చింది. గుట్కా, పాన్‌మసాలాలపై 2013 నుంచి నిషేధం ఉన్నప్పటికీ ఆ వ్యాపారి వీటిని అక్రమంగా తయారు చేయడమే కాక, ఆదాయపు పన్ను శాఖకు 250 కోట్ల వరకు బాకీ పడటంతో అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో అధికారులు స్వాధీనం చేసుకున్న ఒక డైరీలో ఆ వ్యాపారి తాను లంచం ఇచ్చిన వారి పేర్లు ఉన్నాయి. గుట్కా కుంభకోణంతో సంబంధం ఉన్న పలువురు ఉన్నతాధికారులు, నాయకుల పేర్లు ఈ డైరీతో వెలుగులోకి వచ్చాయి. దాంతో ఒక డిఎంకె నేత మద్రాస్ హైకోర్టుకు చేసిన విజ్ఞప్తి మేరకు కోర్టు కేసును సీబీఐకి అప్పగించి దీనిపై విచారణ జరపాలని ఆదేశించింది. దీంతో సీబీఐ అధికారులు బుధవారం ఈ కుంభకోణానికి సంబంధించి ముఖ్యపాత్ర వహించారన్న అనుమానంతో మంత్రి, డీజీపీ, మాజీ డీజీపీ సహా పలువురి ఇళ్లపై దాడులు నిర్వహించింది.
రాష్ట్రానికి సిగ్గుచేటు
గుట్కా కుంభకోణంలో పాత్ర ఉందన్న అనుమానంతో తమిళనాడు మంత్రి, రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారి, మాజీ డీజీపీ ఇళ్లపై సీబీఐ దాడులు నిర్వహించడం రాష్ట్రానికి సిగ్గుచేటని, వెంటనే మంత్రి, డీజీపీలను వారి పదవుల నుంచి తొలగించాలని ప్రతిపక్ష డీఎంకే పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ప్రకటన చేస్తూ ఈ సోదాలు నిజంగా రాష్ట్రానికి అవమానకరమని అన్నారు. విజయభాస్కర్, డీజీపీ రాజేంద్రన్ ఒక్కనిముషం కూడా వారి పదవుల్లో ఉండే అర్హతను కోల్పోయారని విమర్శించారు. ఒకవేళ వారు పదవుల నుంచి తప్పుకోకపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా గవర్నర్ భన్వరిలాల్ వారిని పదవుల నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి విచారణ సజావుగా జరగడానికి ఉన్నత పదవుల్లో ఉన్న వారిని వెంటనే తప్పించాలని సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి కె.బాలకృష్ణన్ కోరారు. ఇంత పెద్ద కుంభకోణంలో వీరి ప్రమేయం వెలుగుచూశాక ప్రభుత్వం, పోలీస్ శాఖపై ప్రజలకు ఇంకేం గౌరవం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. నేరంతో సంబంధమున్న వీరిద్దరిపై సీబీఐ దాడులు చేయడం సరైనదేనని, వీరిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తోందని పీఎంకె వ్యవస్థాపకుడు ఎస్.రామదాస్ ప్రశ్నించారు.
ఈ కేసుతో సంబంధమున్న మంత్రి విజయభాస్కర్‌ను తొలగించాలని తమ పార్టీ గత రెండేళ్ల నుంచి డిమాండ్ చేస్తోందని ఆయన చెప్పారు. వారిద్దరూ ఒక్క క్షణం కూడా ఆ పదవుల్లో ఉండరాదని, వారిని వెంటనే ముఖ్యమంత్రి పళనిస్వామి పదవుల్లోనుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.