జాతీయ వార్తలు

తెరాసకు గోరీ కట్టిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: నియంతలా వ్యవహరించే కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితిని బొందపెట్టి గోరీ కట్టించాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రశేఖరరావుకు పోయేకాలం వచ్చింది కాబట్టే శాసనసభను రద్దు చేసుకున్నాడని ఆయన అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారితో చర్చించిన తరువాతనే శాసనసభను రద్దు చేశామని ముఖ్యమంత్రి చెప్పటం అనుమానాలు కలిగిస్తోందని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా గురువారం సాయంత్రం ఏఐసీసీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికలకు సిద్ధంగానే ఉన్నది.. గెలిచి తీరుతామని అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయటంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఆ వైఫల్యాలను కాంగ్రెస్ ఎండగట్టడంతో భయపడిపోయిన చంద్రశేఖరరావు గడువుకు ఎనిమిది నెలల ముందే ఎన్నిలకు వెళుతున్నాడని ఆయన దుయ్యబట్టారు. చంద్రశేఖరరావు విలేఖరుల సమావేశంలో సిగ్గు శరం లేకుండా మాట్లాడారని అన్నారు. అభివృద్ధి విషయంలో చంద్రశేఖరరావు చెప్పినదంతా తప్పు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. చంద్రశేఖరరావు తెలంగాణ ప్రజలను మోసం చేశారని అన్నారు. లిక్కర్ అమ్మకాలు,
రైతుల ఆత్మహత్యలు, అప్పులు తీసుకోవటంలో మాత్రమే టీఆర్‌ఎస్ ప్రభుత్వం మొదటి స్థానంలో ఉన్నదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల్లో అప్రతిష్ట పాలవుతున్నందుకే చంద్రశేఖరరావు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నాడన్నారు. లిక్కర్ విక్రయం ద్వారా రాష్ట్రం ఇరవై వేల కోట్లు సంపాదిస్తోందని, ఇది రాష్ట్ర ప్రజలను దోచుకోవటం కాదా? అని ఉత్తమ్ ప్రశ్నించారు. ఆత్మగౌరవ భవనాల నిర్మాణమే ప్రారంభం కాలేదన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం
వచ్చిన తరువాత రాష్ట్రంలో శాంతి నెలకొన్నదనటం పచ్చి అబద్ధమన్నారు. మాజీ ప్రధాన మంత్రులు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని విమర్శించిన చంద్రశేఖరరావు ఒక లుచ్ఛా అని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తిట్టిపోశారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే దానిని తానే సాధించానని చంద్రశేఖరరావు చెప్పుకోవటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. మాజీ ప్రధానులను విమర్శించే స్థాయి కేసీఆర్‌కు లేదన్నారు. చంద్రశేఖరరావు అహంకారంతో మాట్లాడుతున్నాడని ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పాడు. కేసీఆర్ కుటుంబం గత నాలుగున్నర సంవత్సరాల నుండి తెలంగాణను దోచుకున్నారు. తెలంగాణలో జరిగిన ప్రతి పనిలో కేసీఆర్ కుటుంబం ఆరు శాతం కమిషన్ తీసుకున్నదని ఆరోపించారు. శాసనసభ ఎన్నికలు కాంగ్రెస్‌కు టీఆర్‌ఎస్‌కు మధ్య జరగడం లేదు.. కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని అణిచివేసిన కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి మాటమార్చిన కేసీఆర్‌కు దళితులు తగిన శాస్తి చేయాలని, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మాటమార్చిన కేసీఆర్‌ను దళితులందరూ నిలదీయాలని అన్నారు. డబుల్ బెడ్ రూంలు పచ్చి దగా.. మోసం కాదా? అని ఆయన నిలదీశారు. అవినీతి, అహంకారంతో తెలంగాణను దోచుకున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు బొంద పెడతారు.. గోరీ కడతారని ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. ప్రతి ఇంటికీకి కుళాయి నీరు ఇవ్వకపోతే ఓట్లు అగడనని చెప్పిన చంద్రశేఖరరావును తెలంగాణ ప్రజలు తిప్పికొడతారని ఆయన అన్నారు.
ఎన్నికల సంఘం స్పందించాలి
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారితో చర్చించిన తరువాతనే శాసన సభను రద్దు చేశామని ముఖ్యమంత్రి చెప్పటం అనుమానాలకు తావిస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు నాలుగు రాష్ట్రాలతోపాటు జరుగుతాయి.. నవంబర్‌లో ఎన్నికలు జరుగుతాయని చంద్రశేఖరరావు చెప్పటంపై కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

చిత్రం..ఢిల్లీలో గురువారం విలేఖరులతో మాట్లాడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.
చిత్రంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్జి కుంతియా తదితరులు