జాతీయ వార్తలు

రాష్ట్ర ఎన్నికలపై నేడు ఈసీ నిర్ణయం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తెలంగాణ శాసనసభ రద్దయిన నేపథ్యంలో శుక్రవారం జరుగుతున్న కేంద్ర ఎన్నికల సంఘం సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రావత్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో తెలంగాణ శాసనసభ ఎన్నికల గురించి కూడా చర్చించనున్నట్లు తెలిసింది. తెలంగాణ అసెంబ్లీ రద్దుకు సంబంధించిన అధికారిక సమాచారం గురువారం రాత్రి కేంద్ర ఎన్నికల సంఘానికి చేరుతుందని భావిస్తున్నారు. ఈ అధికార సమాచారాన్ని శాసన సభ కార్యదర్శి గురువారం రాత్రికి కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేస్తారని చెబుతున్నారు. రాష్ట్ర శాసనసభ కార్యదర్శి పంపించిన సమాచారం ఆధారంగా తెలంగాణ శాసనసభ ఎన్నికల వ్యవహారంపై ఎన్నికల సంఘం దృష్టి కేంద్రీకరించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరం శాసనసభ ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తోంది. తెలంగాణ శాసనసభ ఎన్నికలను ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో జతచేసేందుకు వీలున్నదా లేదా అనేది కూడా ఈ సమావేశంలో పరిశీలిస్తారని చెబుతున్నారు.
తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల జాబితా రివిజన్ ఎంతవరకు వచ్చింది? ఈ ప్రక్రియ ఎప్పటిలోగా పూర్తి కావచ్చుననేది కూడా పరిశీలిస్తారని అంటున్నారు. మధ్యప్రదేశ్ తదితర నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో తెలంగాణ అసెంబ్లీకి నిర్వహించాల్సివస్తే ఏ తేదీల్లో నిర్వహించవచ్చనేది కూడా పరిశీలించనున్నారు.
తెలంగాణ శాసనసభ రద్దు వ్యవహారం అధికారికంగా తమ ముందుకు వచ్చిన తరువాత ఎన్నికల సంఘం సమావేశమై ఏం చేయాలనేది నిర్ణయిస్తుందని ఎన్నికల సంఘం అధికారులు అంటున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరం శాసనసభ ఎన్నికలతోపాటు తెలంగాణ ఎన్నికలు జరుపుతామా లేదా అనేది ఇప్పుడే చెప్పలేమని వారు స్పష్టం చేశారు. పలు అంశాలను లోతుగా పరిశీలించిన తరువాతనే ఒక నిర్ణయానికి రాగలుగుతాం.. తొందరపడి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం ఎంతమాత్రం సాధ్యం కాదని చెబుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి, ఇతర కమిషనర్లతో తాను స్వయంగా ఫోన్లో మాట్లాడిన తరువాతనే శాసనసభను రద్దు చేయాలనే నిర్ణయం తీసుకున్నాను.. శాసనసభ ఎన్నికలు మిగతా నాలుగు రాష్ట్రాలతోపాటు జరిగిపోతాయి.. అక్టోబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది.. నవంబర్‌లో ఎన్నికలు జరిగి డిసెంబర్‌లో ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నదంటూ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హైదరాబాదులో చేసిన ప్రకటనపై స్పందించేందుకు ఎన్నికల అధికారులు నిరాకరించారు. శాసనసభ రద్దుకు సంబంధించిన తీర్మానం తమకు చేరగానే ఏం చేయాలనేదానిపై దృష్టి పెడతామని వారు స్పష్టం చేశారు.