జాతీయ వార్తలు

భారత్ బంద్ ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా/్భపాల్/జైపూర్, సెప్టెంబర్ 6: ఉత్తర భారతదేశంలో రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం ఊపందుకుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎస్సీ,ఎస్టీ చట్టం సవరించడాన్ని నిరసిస్తూ వివిధ సంఘాలు గురువారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో పలు రాష్ట్రాల్లో రైల్‌రోకో, రాస్తారోకోలు జరిగాయి. అనేక పట్టణాల్లో వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. బిహార్‌లో బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు.
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ బంద్ పాక్షికంగా జరిగింది. బంద్ సందర్భంగా అక్కడక్కడా స్వల్ప హింస చోటుచేసుకుంది. బిహార్ రాజధాని పాట్నాలోని రాజేంద్రనగర్ టెర్మినస్‌పై ఆందోళనకారులు దాడి చేశారు. దీంతో 30 నిమిషాల పాటు రైళ్ల సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. రాజ్‌గిర్‌లో దుకాణాలు మూసేశారు. పాఠశాలలు తెరవలేదు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు యథావిధిగా పనిచేశాయి. అలాగే జైపూర్, కరౌలీ, ప్రతాప్‌గఢ్, ఉదయ్‌పూర్, పాలీ నాగౌర్ జిల్లాల్లో షాపులు మూతపడ్డాయి. మధ్యప్రదేశ్‌లో ప్రైవేటు సంస్థలు, పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. కంతి, విదీషా, సెహోర్, దెవాస్, ఇండోర్, గ్వాలియర్, ఝాబవు, చత్తర్‌పూర్, మంద్‌సౌర్, సాగర్, ఉజ్జయినీలో బంద్ సంపూర్ణంగా జరిగింది. యూపీలో ఆందోళనకారుల దాడిలో ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. ఆగ్రాలో బంద్ ప్రశాంతగా జరిగింది.

చిత్రం..భారత్ బంద్ సందర్భంగా గురువారం పాట్నాలో రైల్వే ట్రాక్‌పై టైర్లను తగులబెడుతున్న స్వర్ణ్‌సేన కార్యకర్తలు