జాతీయ వార్తలు

భారత్ కీవీర్ విరాళాలకు ఐటీ మినహాయింపు: రాజ్‌నాథ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: ‘భారత్ కీ వీర్’ పథకానికి ఇచ్చే విరాళాలకు ఆదాయపన్ను మినహాయింపుఉంటుందని కేంద్రం ప్రకటించింది. తీవ్రవాదులతో జరిగే పోరులో మరణించే సైనికుల కుటుంబాలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో భారత్ కీ వీర్‌ను ఏర్పాటు చేశారు. దీన్ని బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ తదితరులు ప్రారంభించారు. ‘్భరత్ కీ వీర్’ ట్రస్ట్‌కు కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. 80(జీ) కింద దానికి ఇచ్చే విరాళాలకు ఆదాయపన్ను మినహాయింపుఉంటుందని కేంద్ర హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం వెల్లడించారు.‘పన్ను మినహాయింపునకు సహకరించిన మంత్రి అరుణ్‌జైట్లీ, ఆర్థిక మంత్రిత్వశాఖకు నా కృతజ్ఞతలు’అని రాజ్‌నాథ్ అన్నారు. పథకానికి గత ఏడాది ఏప్రిల్‌లోనే అంకురార్పరణ జరిగిందని ఆయన స్పష్టం చేశారు. అక్షయ్, గోపీచంద్ ఇందులో ట్రస్టీలుగా చేరినట్టు ఆయన పేర్కొన్నారు. విధి నిర్వహణలో చనిపోయిన సైనికుల కుటుంబాలను ఆదుకోవాలన్న మంచి ఆశయంతో భారత్ కీ వీర్‌ను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. విరాళాలు ఇవ్వాలనుకునే వారు ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్‌లోకి వెళ్లొచ్చని చెప్పారు. భారత్‌కీవీర్.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్ చిరునామాతో రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు.