జాతీయ వార్తలు

రక్షణలో భారత్-అమెరికా ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక, భద్రత, రక్షణ రంగంలో పరస్పర సహకారం అందించుకునే దిశగా కీలక ఒప్పందం జరిగింది. రెండు దేశాల మధ్య 2+2 చర్చలు ఢిల్లీలో గురువారం ప్రారంభమయ్యాయి. రక్షణ ఒప్పందంతో సీమాంతర ఉగ్రవాదం, హెచ్1బీ వీసాలపై ఇరుదేశాల విదేశాంగ మంత్రులు చర్చిస్తారు. కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఇద్దరూ అమెరికా విదేశాంగ మంత్రి మైఖెల్ ఆర్ పాంపెయో, రక్షణ మంత్రి జేమ్స్ మట్టీస్ మధ్య 2+2 చర్చలు మొదలయ్యాయి. నిజానికి ఈ చర్చలు అమెరికాలో జరగాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల రద్దయ్యాయి. గురువారం చర్చల అనంతరం విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సంయుక్త విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ సుహృద్భావ వాతవరణంలో చర్చరు ఫలప్రదం అయ్యాయని సంతృప్తి వ్యక్తం చేశారు.4అన్ని కీలక అంశాలపై ఇరువురు పరస్పర అభిప్రాయాలు పంచుకున్నాం. కమ్యూనికేషన్, కంపాటిబిలిటీ, సెక్యురిటీ అగ్రిమెంట్(సీఓఎంసీఏఎస్‌ఏ) ఒప్పందం ఓ మైలురాయి2అని అమెరికా విదేశాంగ మంత్రి పొంపియో ప్రకటించారు. దేశ భద్రత మరింత పటిష్టం చేసుకోడానికి 2+2 చర్చలు దోహదం చేస్తాయన్న విశ్వాసాన్ని భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యక్తం చేశారు. అమెరికా సాంకేతిక పరిజ్ఞానంతో రక్షణ రంగం బలోపేతమవుతుందని ఆమె స్పష్టం చేశారు. సీమాంతర ఉగ్రవాదం, భద్రత, ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడేందుకు ఇరుదేశాల మధ్య జరిగిన చర్చరు సహకరిస్తాని స్వరాజ్ వెల్లడించారు. పాంపెయో, సుష్మా మధ్య ద్వైపాక్షిక చర్చలు ప్రారంభమయ్యాయి. గత ఏడాది అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ 2+2 చర్చల ఆవశ్యకతను ప్రకటించారు. వాస్తవానికి జూలైలో వాషింగ్టన్‌లో చర్చలు జరగాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల రద్దయ్యాయి. హెచ్1బీ వీసాల మంజూరులో వివక్ష వద్దని భారత్ విజ్ఞప్తి చేసింది. ఇదే విషయాన్ని చర్చల సందర్భంగా పాంపెయో దృష్టికి తీసుకొచ్చినట్టు సుష్మా వెల్లడించారు. శాస్త్ర, సాంకేతిక సహకారంతోపాటు ఉత్పత్తి, పరిశోధనల రంగంలోనూ పరస్పర సహకారం అందించుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించుకున్నారు. ఇరాన్‌పై అమెరికా ఆంక్షల భారత్‌పై పడే అవకాశం ఉన్నందున ఈ విషయాన్ని ఆదేశాల మంత్రులతో చర్చించినట్టు భారత్ వెల్లడించింది.
అలాగే ఇరుదేశాల మధ్య హాట్‌లైన్ ఏర్పాటుకు భారత్-అమెరికా అంగీకరించాయి. కాగా ఉగ్రవాదులు లష్కరెతోయిబాలో భాగమని ఇటీవల అమెరికా పేర్కొనడాన్ని భారత్ హర్షించింది. పొరుగుదేశం పాకిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందన్న భారత్ దాన్ని ఆధారం చేసుకునే అమెరికా ఆ వ్యాఖ్యలు చేసిందని పేర్కొన్నారు. ఉగ్రవాదం వల్ల భారత్, అమెరికాలే కాకుండా మొత్తం ప్రపంచానికే ప్రమాదం అని ఇరుదేశాల మంత్రులు స్పష్టం చేశారు.

చిత్రం..అమెరికా విదేశాంగ, రక్షణ శాఖల మంత్రులు మైఖెల్ ఆర్ పాంపెయో,
జేమ్స్ మట్టీస్‌తో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్