జాతీయ వార్తలు

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరగాళ్ల ఆటకట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: పోలీసుల డాటా బేస్‌లో లభ్యం కాని నేరగాళ్ల వివరాలను కనుగొనడానికి సామాజిక మాధ్యమాలను ఆమూలాగ్రం తవ్వితీసి వారిని గుర్తించే ఫేస్ రికగ్నిషన్ (ముఖాన్ని గుర్తించే) సాఫ్ట్‌వేర్‌ను తయారు చేయడానికి రక్షణ సంస్థల ఆధ్వర్యంలో ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. మూడురోజుల పాటు నిర్వహించే సెక్యూరిటీ ఎక్స్‌పో, సమావేశాన్ని గురువారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్‌క్రైమ్ ఒక పెద్దసవాల్‌గా మారిందని అన్నారు. నేరగాళ్లు సైతం టెక్నాలజీని విస్తృతంగా వాడుతున్నారని, తమ ఉగ్ర కార్యకలాపాలకు నియామకాలు, సందేశాలు పంపడం, రహస్య సమాచారం అందజేత, నగదు బదిలీ తదితర అంశాలన్నీ ఇంటర్నెట్ ద్వారానే జరుగుతున్నాయని చెప్పారు. వీటికి అడ్డుకట్ట వేయడానికి మొదటిసారిగా కేంద్రం ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ డివిజన్‌ను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. రక్షణ, భద్రతాపరమైన అంశాల్లో ఇప్పుడు డ్రోన్‌ల ఉపయోగం తప్పనిసరి అయిందని, దేశంలో వీటిని విస్తృతంగా వినియోగించడానికి ఒక విధాన నిర్ణయాన్ని తీసుకుంటామని తెలిపారు. ఈ డ్రోన్‌ల వ్యవస్థపై తనకు చాలానమ్మకముందని, వాటి పనితనాన్ని తాను స్వయంగా పరిశీలించానని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రక్షణ సంస్థలు అందిపుచ్చుకోవాలని ఈ దిశగానే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం సీసీటీవీల ద్వారా మనం క్రిమినల్స్ జాడలను పసిగడుతున్నామని, కాని చాలా సందర్భాల్లో వారిని గుర్తించడం కష్టంగా మారిందని అన్నారు. ఈ నేపథ్యంలో అలాంటి వారి ముఖాలను గుర్తుపట్టే ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ అవసరమని, దానిని పొందడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. పోలీసు నెట్‌వర్క్ డాటాలో వివరాలు లేని క్రిమినల్స్‌ను సైతం పట్టుకోవడానికి, సామాజిక మాధ్యమాలను తవ్వితీసి, వారి వివరాలను సేకరించే టెక్నాలజీని సైతం సాధించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ చెప్పారు. అలాగే జమ్మూ సరిహద్దులో లేజర్ ఫెన్సింగ్‌ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తామన్నారు.
నాలుగేళ్లుగా ఒక్క ఉగ్రదాడీ లేదు
తాము అధికారం చేపట్టిన తర్వాత నాలుగేళ్ల కాలంలో దేశంలో పెద్ద ఉగ్రవాద దాడి సంఘటన ఒక్కటీ కూడా జరగలేదని, ఇది తాము సాధించిన ఘనత అని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ప్రస్తుతం దేశంలో నేరాలు, ఉగ్రవాదం అతిపెద్ద సమస్యలని, ఇవి నూతన సాంకేతికను ఉపయోగిస్తూ దేశంలో అస్థిరతకు ప్రయత్నిస్తున్నాయని, వాటిని ఎదుర్కోవడానికి తాము కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతూ అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. రక్షణకు సంబంధించి ఆయుధాలు, పరికరాలు, గాడ్జెట్‌ల కొనుగోలు పద్ధతిని సరళీకృతం చేశామని, గతంలో ఉండే మూడంచెల విధానం స్థానంలో రెండు విడుదల పద్ధతిని ప్రవేశపెట్టామని ఆయన తెలిపారు. అవసరమైతే రక్షక దళాల అధిపతులకు ఆర్థికపరమైన అధికారాలు సైతం కల్పిస్తామని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

చిత్రం..ఢిల్లీలో గురువారం సెక్యూరిటీ ఎక్స్‌పోను ప్రారంభిస్తున్న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్