జాతీయ వార్తలు

రాఫెల్ పై ఆరోపణలు వాస్తవ విరుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోలేదని డిప్యూటీ చీఫ్ ఎయిర్ మార్షల్ రఘునాథ్ నంబియార్ గురువారం ఇక్కడ తోసిపుచ్చారు. రాఫెల్ విమానాల కొనుగోలుకు సంబంధించి భారత్-ఫ్రాన్స్ మధ్య జరిగిన ఒప్పందంలో ఎలాంటి లోపాలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని సుబ్రుతో పార్క్‌లో 38వ హేలీ పవర్ ఇండియా2 పేరులో ఓ అంతర్జాతీయ సెమినార్ ఏర్పాటయింది. రాఫెల్ డీల్‌కు సంబంధించి రఘునాథ్‌పై మీడియా ప్రశ్నలు సంధించింది. 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో విమర్శలు గుప్పిస్తున్నారు. ఎక్కువ ధర చెల్లించి విమానాలు కొనుగోలు చేశారని, ఇందులో పెద్ద కుంభకోణమే చోటుచేసుకుందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ఆరోపణలకు కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. అయితే రాఫెల్ యుద్ధ విమానాల ధరలు, ఎంత చెల్లించింది మాత్రం కేంద్రం వెల్లడించడం లేదు. భారత్- ఫ్రాన్స్ మధ్య 2008లో జరిగిన ఒప్పందం ప్రకారమే కొనుగోలు చేసినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. యూపీఏ ప్రభుత్వం 540 కోట్లతో ఒప్పందం చేసుకుంటే మోదీ సర్కార్‌లో అది 1600 కోట్లయిందని రాహుల్ తెలిపారు.4్ధరలకు సంబంధించి సమాచారం లోపం ఉంది. అంతే తప్ప అవన్నీ వాస్తవం కాదు. భారత వైమానిక విభాగం విషయంకొస్తే ఎక్కడా ఎలాంటి లోపం జరిగినట్టు భావించడం లేదు2అని నంబియార్ తెలిపారు. ఫ్రాన్స్ ప్రభుత్వంతో జరిగిన చర్చల సారాంశానే్న తాను చెబుతున్నానని ఆయన చెప్పారు.