జాతీయ వార్తలు

సారథి అమిత్ షా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: వచ్చే ఏడాది 2019 ఎన్నికలు పూర్తయ్యే వరకు బీజేపీ అధ్యక్షుడిగా పార్టీ రథ సారథిగా అమిత్ షానే కొనసాగుతారు. వాస్తవానికి అమిత్ షా అధ్యక్షుడిగా పదవీ కాలం వచ్చే ఏడాది జనవరితో ముగుస్తుంది. ఎన్నికలు పూర్తయ్యే వరకు పార్టీ సంస్థాగత ఎన్నికలను నిలిపివేయనున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో, ఇప్పుడున్న టీంతోనే బీజేపీని నడిపిస్తారు. ఎన్నికల సంవత్సరంలో పార్టీ అధ్యక్షుడు, సంస్థాగతంగా మార్పులు వాంచనీయం కాదన్నారు. గతంలో ఎన్నికల సమయంలో అంతవరకు ఉన్న అధ్యక్షుడే పార్టీని నడిపించిన సందర్భాలు ఉన్నాయని పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. అమిత్ షా ఆధ్వర్యంలోనే పార్టీ వచ్చే ఎన్నికలను ఎదుర్కొంటుందని పార్టీ వర్గాలు చెప్పాయి. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్, మే నెలల్లో జరిగే అవకాశం ఉంది. ఈ అంశాన్ని పార్టీ కార్యవర్గంలో చర్చించారు. 2014 మే ఎన్నికల్లో బీజేపీ గెలిచిన సమయంలో పార్టీ అధ్యక్షుడిగా రాజ్‌నాథ్‌సింగ్ ఉన్నారు. ఆ తర్వాత అమిత్ షా పార్టీ పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత 2016 జనవరిలో పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బీజేపీ పార్టీ బైలాస్ ప్రకారం కొత్త అధ్యక్షుడి పదవీకాలం రెండేళ్లు. మూడు సార్లు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగవచ్చును. దీనిని బట్టి చూస్తే మరోసారి అమిత్‌షా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగడం ఖాయమని పార్టీ వర్గాలు తెలిపాయి.
మళ్లీ మోదీనే ప్రధాని
వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అఖండ మెజార్టీ లభిస్తుందని , నరేంద్రమోదీ ప్రధానిగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపడుతారని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. బీజేపీ మేకింగ్ ఇండియా నిర్మాణంలో క్రియాశీల పాత్ర వహిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ విచ్చిన్నానికి పాల్పడుతోందన్నారు. పార్టీ జాతీయ కార్యవర్గం సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ సారి ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ సీట్లు బీజేపీకి వస్తాయన్నారు. మోదీ ప్రభుత్వం దేశాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తోందన్నారు. ఆర్థిక రంగంలో ఫ్రాన్స్ కంటే ముందంజలో భారత్ ఉందన్నారు. బీజేపీ 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉందన్నారు. కార్యకర్తలు వచ్చే ఎన్నికల్లో పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు కష్టపడి పనిచేయాలన్నారు. విపక్షాలకు పనీపాట లేదని, అధికారం తప్ప మరో ధ్యాస లేదన్నారు. మహాకూటమి అనేది కంటితుడుపు లాంటిదన్నారు. విపక్షాలు భ్రమల్లో జీవిస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు.

చిత్రం..ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యనిర్వాహక వర్గ సమావేశాలను ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ