జాతీయ వార్తలు

ఎన్నికలకు మేమూ సిద్ధమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: తెలంగాణలో ఊహించని విధంగా వచ్చిన ఎన్నికలను ఎదుర్కొనేందుకు భారతీయ జనతా పార్టీ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వెల్లడించారని తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. ఢిల్లీలో శనివారం బీజేపీ పదాధికారుల, వివిధ రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికల అంశాన్ని ప్రారంభోత్సవ ఉపన్యాసంలో అమిత్ షా ప్రస్తావించారని, తెలంగాణ ఎన్నికలకు పార్టీ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని వెల్లడించినట్టు చెప్పారు. తెలంగాణలో పార్టీ మొదటి విడతగా 50 సభలను ఏర్పాటు చేయాలని, ప్రత్యేకంగా తెలంగాణ విమోచన దినం రోజున భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ సమాలోచనలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ సభలకు పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతోసహా కేంద్ర మంత్రులు, ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని అధికార పార్టీకి దీటుగా ప్రచారం చేస్తారని ఆయన ప్రకటించారు. టీఆర్‌ఎస్ పార్టీ గత నాలుగేళ్లలో
వైఫల్యాలను ఈ సభల ద్వారా ఎండగడతామని ఆయన చెప్పారు. అమిత్ షా ఇప్పటికే తెలంగాణలో గెలుపు దిశగా సన్నాహాలు చేసుకోవాలని రాష్ట్ర పార్టీని ఆదేశించారని, ఆ దిశగానే ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక చేయమన్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలను రంగంలోకి దించితీరుతామని లక్ష్మణ్ స్పష్టం చేశారు. తెలంగాణలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగానే అన్ని సీట్లకు పోటీ చేస్తామని తెలిపారు. కేంద్రంలో అవినీతి రహిత, శీఘ్రగతిన పురోగతి సాధించే పాలనను అందించిన ప్రధాని మోదీ నాయకత్వాన్ని వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు స్వాగతిస్తారని చెప్పారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసంతృప్తివాదులు బీజేపీ వైపు చూస్తున్నరని లక్ష్మణ్ చెప్పారు.
టీడీపీ-కాంగ్రెస్ పొత్తు అనైతికం
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం-కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేయాలని సమాలోచనలు చేస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌తో పొత్తుకోసం ప్రయత్నాలు చేస్తూ.. టీడీపీ సిద్ధాంతాలను తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక సిద్ధాంతాల మీద వచ్చిన తెలుగుదేశం, అదే పార్టీతో పొత్తు పెట్టుకోవడం అనైతికమని అన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తెలంగాణలో తాము అధికారం చేపడతామని చేస్తున్న ప్రకటన పట్ల రాష్ట్ర ప్రజలంతా ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఆనాటి రజాకార్ల పాలనను అక్బరుద్దీన్ మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నారని చెప్పారు. అలాగే ఎంఐఎం ప్రభావం ఉన్నచోట టీఆర్‌ఎస్ పార్టీ ముస్లిం అభ్యర్థులను పెట్టలేదని ఆయన విమర్శించారు.