జాతీయ వార్తలు

తమిళనాడులో ఈడీ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: తమిళనాడులో రూ.90 కోట్ల బ్యాంకు రుణాల, మనీల్యాండరింగ్ కుంభకోణం కేసులో దర్యాప్తును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముమ్మరం చేసింది. మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో శనివారంనాడు ఈడీ దాడులు, తనిఖీలు నిర్వహించింది. ఇందులో భాగంగా విరుదునగర్ జిల్లా కేంద్రంతోబాటు, మధురై, కోయంబత్తూర్ ప్రాంతాల్లోని ఇన్షుమతి రిఫైనరీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన యజమానులు, భాగస్వాముల ఆస్తులు, ఇళ్లలో సోదాలు జరిగాయి. కంపెనీ యజమాని షెన్బగంతోబాటు పలువురిపై మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్పారు.బోగస్ సంస్థలు, నకిలీ ఇన్‌వాయిస్‌లతో 87.36 కోట్లకు మోసగించిందన్న అభియోగం ఉంది.