జాతీయ వార్తలు

ఏ భారతీయుడినీ విస్మరించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: జాతీయ పౌర నమోదు (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్) లో మన దేశానికి చెందిన ఏ పౌరుడినీ విస్మరించబోమని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. బీజేపీ నాయకుడు సునిల్‌దియోధర్ నెలకొల్పిన మైహోం ఇండియా స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో శనివారం నాడిక్కడ జరిగిన ఈశాన్య రాష్ట్రాల విద్యార్థి మహోత్సవంలో ఆయన ప్రసంగించారు. జాతీయ పౌర రిజిస్ట్రేషన్ (ఎన్‌ఆర్‌సీ) తప్పనిసరిగా చేయించుకోవాలని, తద్వారా మనదేశంలోకి జరిగే అక్రమ చొరబాట్లకు అడ్డుకట్ట వేయవచ్చని పేర్కొన్నారు. నిజమైన భారత పౌరులెవ్వరినీ ఎన్‌ఆర్‌సీ నుంచి విస్మరించడం జరగదని ఆయన స్పష్టం చేశారు. ఎవరు భారతీయులు, ఎవరు కాదో తెలుసుకునేందుకు ఆన్‌ఆర్‌సీ తప్పనిసరి అన్నారు. ఇందుకు సంబంధించి ఈ జాబితా అప్‌డేట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. సుప్రీం కోర్టు ప్రత్యక్ష నేతృత్వంలో అస్సాం పౌరుల ఎన్‌ఆర్‌సీ జాబితాను రూపొందించడం జరిగిందన్నారు. గత జూలైలో ప్రచురించిన డ్రాఫ్ట్ జాబితా నుంచి 40 లక్షల మందిని మినహాయిస్తూ మిగిలిన నిజమైన భారతీయుల జాబితా పేరిట రూపొందించారు. ఈ క్రమంలో ఈ అంశం వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే.