జాతీయ వార్తలు

బెంగళూరులోనే ఎయిరో ఇండియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ఎయిరో ఇండియా బెంగళూరు నుంచి తరలిపోనుందన్న ఊహా గానాలకు రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం తెరదించింది. ఎయిరో ఇండియా తదుపరి ఎడిషన్ బెంగళూరులోనే జరుగుతుందని స్పష్టం చేసింది. ఆసియాలోనే అతిపెద్ద ప్రదర్శనగా పేరొందిన వైమానిక అంతరిక్ష ప్రదర్శన (ఎయిరో స్పేస్ ఎగ్జిబిషన్) వచ్చే యేడాది ఫిబ్రవరి 20 నుంచి 24 వరకు యధావిధిగా బెంగళూరు వేదికగానే జరుగుతుందని అధికారులు తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గత నెలలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి లక్నోను ఎయిరో ఇండియాకు వేదికగా చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ విషయంపై వివిధ రాజకీయ పార్టీల్లో నిరసనలు మిన్నంటాయి. ఎయిరో ఇండియా 12వ ఎడిషన్ నిర్వహణపై గుజరాత్, రాజస్థాన్, ఒడిషా, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాలు సైతం చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుంటున్నామని రక్షణ మంత్రిత్వ శాఖ చెప్పడంతో బెంగళూరు నుంచి ఎయిరో ఇండియా తరలిపోవడం ఖాయమని ఊహాగానాలు, దీనిపై నిరసనలు వెల్లువెత్తాయి. ఆఖరుకు బెంగళూరునే వేదికగాప్రభుత్వం నిర్ణయించి ఊహాగానాలకు తెరదింపింది. ఎయిరో ఇండియా ఏర్పాటైన 1996 నుంచి ఈప్రదర్శన బెంగళూరులోనే నిర్వహిస్తున్నారు. పలు దేశాలకు చెందిన రక్షణ మంత్రిత్వ శాఖ పెద్దలు, వైమానిక, అంతరిక్ష పరిశోధనా రంగాల్లో పెట్టుబడులు పెడుతున్న పలువురు అంతర్జాతీయ ప్రముఖులు ఈ ఐదు రోజుల ప్రదర్శనకు హాజరవుతామన్నారు. దేశీయంగా వైమానిక రంగ పరిశ్రమ (డొమెస్టిక్ ఏవియేషన్ ఇండస్ట్రీ)కి ఊతం ఇవ్వడంతోబాటు కేంద్ర ప్రభత్వ మేకిన్ ఇండియా నినాదాన్ని విస్తరించప జేయడం కూడా ఈ ప్రదర్శన ముఖ్యోద్దేశ్యమని నిర్వాహకులు చెప్పారు. ఇలాంటి బృహత్ ప్రదర్శన లక్నోలో నిర్వహించడం ద్వారా అక్కడ తలపెట్టిన రక్షణ శాఖ కారిడార్‌కు ప్రోత్సాహం అందుతుందని యూపీ ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అయితే బెంగళూరే ఈప్రదర్శనకు అనువైన వేదికంటూ కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాయడంతో తరలింపు ప్రతిపాదనకు బ్రేక్ పడింది. రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన తయారీలకు అనుగుణంగా 2018-19లో తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌లకు రెండు రక్షణ శాఖ కారిడార్‌లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తర్‌ప్రదేశ్ కారిడార్ అలీఘర్, ఆగ్రా, ఝాన్సీ, కాన్పూర్, లక్నో, చిత్రకూట్ జిల్లాల మీదుగా ఏర్పాటవుతుంది.