జాతీయ వార్తలు

కొందరి ఇష్టం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, సెప్టెంబర్ 8: పాకిస్తాన్ కొత్త ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ హయాంలో భారత్-పాక్ మధ్య సంబంధాలు మెరుగవుతాయన్న ఆశాభావాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా వ్యక్తం చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుడు షేక్ మహ్మద్ అబ్దుల్లా 36వ వర్థంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగురచేందుకు దివంగత మాజీ ప్రధాని వాజపేయి ఓ ప్రయత్నం చేశారన్నారు. ప్రధాని నరేంద్రమోదీ కూడా వాజపేయిని బాటలో నడవాలని అబ్దుల్లా సూచించారు. షేక్ మహ్మద్ అబ్దుల్లా కుమారుడైన ఫరూక్ శ్రీనగర్ లోక్‌సభ సభ్యుడు కూడా. రెండు దేశాలు స్నేహంగా ఉండడం కొందరికి ఇష్టంలేదని ఆయన సంచల వ్యాఖ్యలు చేశారు. 3పాక్ కొత్త ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నాం. అపరిష్కృతమైన ఆనేక సమస్యలు పరిష్కారమై, ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుకు సానుకూలత వస్తుందని భావిస్తున్నాం2 అని ఆయన తెలిపారు.4 ఆర్‌ఎస్‌ఎస్, జన్‌సంఘ్ నాయకుడైనప్పటికీ వాజపేయి పాకిస్తాన్‌తో స్నేహపూరితంగానే వ్యవహరించారు. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలను ఆయన కోరుకునేవారు2 అని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ పేర్కొన్నారు. అదే పార్టీకి చెందిన ప్రధాని నరేంద్రమోదీ దివంగత వాజపేయి బాటలో నడవాలని అబ్దుల్లా కోరారు. భారత్-పాక్ మధ్య మంచి సంబంధాలు ఉంటేనే ఈ ప్రాంతంలో ప్రగతి సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ దిశగా చర్యలు తీసుకుంటారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కొందరు నాయకులు సొంత ప్రయోజనాలను ఆశించి సంబంధాలను దెబ్బతీస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత దుయ్యబట్టారు. అలాంటి నాయకులు రెండు దేశాల్లోనూ ఉన్నారని వెల్లడించారు. పంజాబ్ మంత్రి నవ్‌జోత్ సింగ్ సిద్ధు పాక్ సైనికాధికారితో కరచాలనం చేస్తే మీడియా విమర్శలు గుప్పించిందని ధ్వజమెత్తా రు.4రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కొన్ని వార్తా చానళ్లకు ఇష్టం లేదన్నారు.
అన్ని ఎన్నికలనూ బహిష్కరిస్తాం
జమ్మూకాశ్మీర్‌లో పంచాయతీ, పురపాలక సంఘాల ఎన్నికలకు దూరంగా ఉంటామని ఇటీవల ప్రకటించిన నేషనల్ కాన్ఫరెన్స్ శనివారం మరో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆర్టికల్ 35-ఏ పరిరక్షణకు కేంద్రం చర్యలు తీసుకోని పక్షంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు బహిష్కరిస్తామని పార్టీ హెచ్చరించింది. రాష్టప్రతి ఆదేశానుసారం 1954లో రాజ్యాంగంలో ఆర్టికల్-35ఏను పొందుపరిచారని ఆయన గుర్తుచేశారు. దీని ప్రకారం జమ్మూకాశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు, సదుపాయాలు సంక్రమించాయని ఆయన తెలిపారు. ఇప్పుడు దాని ఉనికే ప్రశ్నార్థకంగా మారితే ప్రజలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతామని ఆయన ప్రశ్నించారు.4కేంద్రం చొరవ తీసుకోవాలి. ఆర్టికల్-35ఏ పరిరక్షణకు తక్షణ చర్యలు అవసరం ఉంది. జమ్మూకాశ్మీర్ ప్రత్యేక చట్టాన్ని బలహీనపరచాలని ప్రయత్నిస్తే మా దారి మేం చూసుకుంటాం. శాసన సభ, పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తాం2అని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు. 3స్థానిక ఎన్నికలే కాదు..అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉంటాం2అని ఆయన స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్ విషయంలో కేంద్రం ద్వంద్వ విధానాలు పాటిస్తోందని ఆయన ఆరోపించారు. 3 ఓ పక్క ఎన్నికలు జరుపుతోంది. మరోపక్క ఆర్టికల్ -35ఏ, ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేసే కుట్ర పన్నుతోంది2అని ఆయన తీవ్రమైన ఆరోపణ చేశారు.

చిత్రం..తన తండ్రి షేక్ అబ్దుల్లా 36వ వర్ధంతి సందర్భంగా శనివారం శ్రీనగర్‌లో నివాళులర్పిస్తున్న
నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా