జాతీయ వార్తలు

నేడు భారత్ బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సోమవారం జరుగనున్న బంద్‌లో ఎలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడవద్దని, ప్రశాంతంగా భారత్ బంద్ నిర్వహించాలని కాంగ్రెస్ శ్రేణులకు అధిష్టానం సూచించింది. పెట్రో ధరల పెంపు, రూపాయి విలువ పతనం తదితరాలకు నిరసనగా విపక్ష కాంగ్రెస్ పార్టీ భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కాగా మొత్తం 21 ప్రతిపక్ష పార్టీలు, ప్రజా, వ్యాపార, కార్మిక సంఘాలు భారత్ బంద్‌కు మద్దతునిస్తున్నాయని కాంగ్రెస్ నేతలు ఆదివారం నాడిక్కడ తెలిపారు. పెట్రోలు, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి చేర్చాలని డిమాండ్ చేశారు. అలాచేస్తే చమురు ధరలు 15 నుంచి 18 రూపాయలకు పడిపోతాయన్నారు. మనం గాంధీ వారసుమనే విషయాన్ని గుర్తుంచుకుని ఉద్యమాల్లో అహింసామార్గాన్ని అనుసరించాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజయ్‌మాకెన్ పార్టీ శ్రేణులకు సూచించారు. ఆదివారం పెట్రోలు, డీజిల్ ధరలు సరికొత్త రికార్డును నమోదు చేశాయని ఆయన విలేఖరుల సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు తగ్గినా దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. 2014 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం 211.7 శాతం పెరిగిందని,
అలాగే డీజిల్‌పై 433శాతం పెరిగిందని వివరించారు. ప్రభుత్వం కోట్లాది రూపాయల ఎక్సైజ్ సుంకం వసూలు చేస్తూ సామాన్య జనంపై పెనుభారం మోపి, నిలువుదోపిడీ చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో సైతం ఇందన ధరల పెరుగుల, రూపాయి విలువ పడిపోవడంపై మచ్చుకైనా చర్చించ లేదని మాకెన్ విమర్శించారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో వుండగా చమురు ధరల పెంపుతో సామాన్యుడి నడ్డివిరుస్తున్నారని విమర్శించిన నరేంద్ర మోదీ ఇప్పుడు చేస్తున్నదేమిటని ఆయన ప్రశ్నించారు. మేకిన్ ఇండియా..బ్రేకిన్ ఇండియా అంటూ ప్రజలను మభ్యపెట్టవద్దని ఆయన ఎద్దేవా చేశారు. మేకిన్ ఇండియా అంటూ రాఫెల్ జట్ విమానాల కుంభకోణానికి పాల్పడ్డారని విమర్శించారు. ఈ వ్యవహారంపై నిగ్గుదేల్చేందుకు జాయింట్ పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందో తెలపాలని మాకెన్ డిమాండ్ చేశారు.