జాతీయ వార్తలు

ఇది వాస్తవాలు, కలల మధ్య పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: లోక్‌సభకు వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో బీజేపీ, పగటి కలలు కనే పార్టీల మధ్యే పోటీ ఉంటుందని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆదివారం ఇక్కడ జరిగిన సమావేశంలో పాల్గొన్న పలువురు నాయకులు 2022కల్లా ‘న్యూ ఇండియా’ పేరిట దేశాన్ని పటిష్టవంతంగా నిర్మించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందుకు తీసుకువెళ్లగలరని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 70 శాతం ప్రజల మద్దతు మోదీకే ఉందని, దారిద్య్రం, కుల, మత వర్గ విభేదాలు, అవినీతి వంటి అంశాలకు వ్యతిరేకంగా దేశాన్ని పటిష్టంగా నిర్మించేందుకు ప్రధానమంత్రి మోదీ ముందుకు దూసుకువెళ్తుంటే, ఆయనకు వ్యతిరేకంగా అడ్డంకులు సృష్టిస్తూ ప్రతిపక్షాలు ‘మోదీని ఆపండి’ (రోకో మోదీ) అంటూ నినదిస్తున్నాయని కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ మీడియా ప్రతినిధులతో వ్యాఖ్యానిస్తూ పేర్కొన్నారు. 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఇప్పటికంటే ఎక్కువగా సీట్లు, ఓట్లతో గెలుపొంది మళ్లీ అధికారంలోకి రానుందని ఆయన జోస్యం చెప్పారు. ఇపుడున్న ప్రతిపక్షాలు పగటి కలలు కంటున్నాయని, ఆయా పార్టీలకు సరైన నాయకత్వం గానీ, రాజకీయ సిద్ధాంతాలు గానీ లేవని, వాళ్లకు ఉన్నదంతా ప్రధాని మోదీ అమలు చేస్తున్న అజెండాను అడ్డుకోవడంతోపాటు ప్రజాక్షేత్రంలో ఒంటరివాడిని చేయాలనే రాజకీయ కుట్రలు, కుతంత్రాలు పన్నడమేనని ఆయన ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో చేసిన పలు తీర్మానాలను ఆయన ప్రస్తావించారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించిన తీర్మానంలో ప్రభుత్వం అంతర్గత భద్రత, గత యూపీఏ హయాంలో దేశవ్యాప్తంగా వివిధ పట్టణాల్లో జరిగిన తీవ్రవాద కార్యకలాపాలతోపాటు, బాంబు విధ్వంసాల నిరోధానికి తీసుకున్న చర్యలను పోల్చుతూ ప్రస్తావించారు. ప్రధాని మోదీ, అధ్యక్షుడు అమిత్ షా నాయకత్వంపై సమావేశంలో తీర్మానం ఆమోదం పొందిన విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ తెలిపారు. మోదీ ఆకర్షణీయమైన, అద్భుతమైన నాయకత్వ పటిమ, దూరదృష్టి, అభిరుచి, అమిత్ షా గట్టి కృషి, పోరాటం ద్వారా బీజేపీ మరింత బలపడి, దేశంలోని 19 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిందని ఆయన అన్నారు. మోదీ, షా జోడీ వెంట 350 ఎంపీలు, 1500 ఎమ్మెల్యేలు ఉన్నారని ఆయన అన్నారు. ప్రధాని మోదీ అమలు చేస్తున్న ‘సబ్‌కా సాథ్’, ‘సబ్‌కా వికాస్’ వంటి కార్యక్రమాల ద్వారా 70 శాతానికి పైగా ప్రజల మద్దతుతో దూసుకుపోతున్నారని ఆయన పేర్కొన్నారు. అంతర్గత భద్రత లేకుండా అభివృద్ధికి పునాదులు బలపడవని ఆయన అన్నారు. అదేవిధంగా దేశ ఆర్థిక ప్రగతితోపాటు జీఎస్టీ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా ప్రగతి సాధనలో కేంద్రం ముందుకు వెళ్తోందని ఆయన అన్నారు. పెట్రో ధరల పెంపుపై దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు సోమవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తమ ప్రభుత్వం పెట్రో ధరలపై సరైన విధానంతోనే పనిచేస్తోందని కేంద్ర మంత్రి జవడేకర్ సమర్ధించుకున్నారు.
చిత్రాలు..ఢిల్లీలో ఆదివారం జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ,
* హాజరైన ప్రతినిధులు