జాతీయ వార్తలు

ఐసీయూలోనే దిలీప్‌కుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై, సెప్టెంబర్ 9: బాలీవుడ్ ప్రఖ్యాత హీరో దిలీప్‌కుమార్ ఇన్‌టెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చికిత్స పొందుతున్నారు. చాతీలో ఇన్‌ఫెక్షన్లు తలెత్తిన కారణంగా తొభై ఐదేళ్ల దిలీప్‌కుమార్‌ను ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో గత బుధవారం చేర్పించిన సంగతి తెలిసిందే. కాగా ఆయన వైద్యానికి బాగా స్పందిస్తున్నారని, ఆరోగ్య పరిస్థితి చాలా మెరుగైందని సతీమణి సైరాభాను తెలిపారు. ప్రస్తుతం స్వల్పంగా న్యుమోనియాతో ఆయన ఇబ్బంది పడుతున్నారని ఆమె చెప్పారు. ఐసీయూలో చికిత్స పొందుతున్నప్పటికీ ఆయన బాగా కోలుకోవడం ఆనందంగా ఉందని ఆస్పత్రి ఉపాధ్యక్షుడు అజయ్‌కుమార్ పాండే తెలిపారు. అభిమానుల ప్రార్థనలు ఫలిస్తున్నాయని ఆయన సమీప బంధువుఫైజల్ ఫరూఖీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. బాలీవుడ్‌లోట్రాజడీ కింగ్‌గా పేరొందిన దిలీప్‌కుమార్ అందాజ్, ఆన్, మధుమతి, దేవదాస్, ముగల్-ఏ-ఆజమ్ వంటి ఎన్నో చిత్రాల్లో మహోన్నత నటనతో తనదైన ముద్రవేశారు.