జాతీయ వార్తలు

వచ్చే ఏడాదిలోగా ‘రాఫెల్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: రాజకీయ వివాదాలతో సంబంధం లేకుండా రాఫెల్ యుద్ధ విమానాలను వినియోగించే విషయమై సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు ఎయిర్‌ఫోర్స్ చర్యలు తీసుకోంటోంది. రాఫెల్ యుద్ధ విమానాలపై అధికార, విపక్షాల మధ్య తీవ్రస్థాయిలో చర్చలు, సవాళ్లు చోటుచేసుకున్న సంగతి విదితమే. పైలెట్లకు శిక్షణ, దీనికి అవసరమైన వౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికను రూపొందించింది. ఈ ఏడాది చివరకు సుశిక్షితులైన ఎయిర్‌ఫోర్స్ సిబ్బందిని ఫ్రాన్స్‌కు పంపించనున్నారు. అక్కడ రాఫెల్ జెట్ విమానాల శిక్షణ పొందనున్నారు. ఇప్పటికే చాలా మంది ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది ఫ్రాన్స్‌కు వెళ్లి విమానాలను చూసి వచ్చారు. రాఫెల్ జెట్స్‌ను దాసల్ట్ ఏవియేషన్ సంస్థ రూపొందిస్తోంది. భారత్-ఫ్రాన్స్ మధ్య 36 రాఫెల్ ఫైటర్‌జెట్స్‌పై 2016లో ఒప్పందం కుదిరింది. వీటి విలువ రూ.58వేల కోట్లు. ఈ జెట్స్‌ను భారత్‌కు వచ్చే ఏడాది సెప్టెంబర్ నుంచి పంపిస్తారు. భారత్ వైమానిక రంగ నిపుణులు సూచించిన మార్పులకు అనుగుణంగా రాఫెల్ జెట్స్‌ను తయారు చేస్తున్నారు. ఈ విమానాల కోసం అంబాలాలో వౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇండో పాక్ సరిహద్దుకు 220 కి.మీ దూరంలో ఈ పాయింట్ ఉంది. రెండవ పాయింట్‌ను పశ్చిమబెంగాల్‌లో హసీమారా బేస్‌లో ఏర్పాటు చేస్తారు. సదుపాయాల నిమిత్తం ఇప్పటికే ప్రభుత్వం రూ.400 కోట్లను కేటాయించింది. ఈ విమానాల నిర్మాణంపై ఫ్రాన్స్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు భారత్‌కు తెలియచేస్తోంది. గత ఏడాది ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా ఫ్రాన్స్‌కు వెళ్లి ఈ విమానాల సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి వచ్చారు. ఒప్పందం ప్రకారం 67 నెలల్లో ఈ విమానాల డెలివరీ ప్రక్రియ పూర్తికావాల్సి ఉందని భారత ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు.