జాతీయ వార్తలు

కాశ్మీర్‌కు పాక్ చిచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 14: కాశ్మీర్ అల్లర్లకు పాకిస్తాన్ ఆజ్యం పోస్తోందని భారత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. భద్రతా దళాల కాల్పుల్లో హిజ్‌బుల్ మిలిటెంట్ బుర్హాన్ మరణించడం పూర్తిగా ఆంతరంగిక వ్యవహారమని, ఇందులో జోక్యం చేసుకుని అల్లర్లను రెచ్చగొట్టే చర్యల్ని మానుకోవాలని పాక్‌కు హితవు పలికింది. తాజా పరిస్థితుల్ని ఆసరా చేసుకుని కాశ్మీర్ లోయ ప్రాంతంలోకి మిలిటెంట్ల చొరబాట్లను ప్రోత్సహించడమే కాకుండా స్థానిక ఉగ్రవాద సంస్థలకు మద్దతునిస్తూ పరిస్థితిని విషమింపజేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం మాట్లాడిన విదేశాంగ విభాగం అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ పాక్ ధోరణిని ఎండగట్టారు. కాశ్మీర్ పరిణామాలతో పాకిస్తాన్‌కు ఏ రకంగానూ సంబంధం లేదని, అనవసరంగా ప్రమేయం కల్పించుకోవడానికి స్వస్తి పలకాలన్నారు. కాశ్మీర్ ప్రజల మనోభావాల్ని రెచ్చగొట్టడమే పాకిస్తాన్ పనిగా పెట్టుటుందని, ఇందులో భాగంగానే అనేక కుట్రలు, కుయుక్తులకు పాల్పడుతోందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తన సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసమే కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలకెక్కించేందుకు పాక్ ప్రయత్నిస్తోందన్నారు. అసలు ఉగ్రవాదులకు ఎవరు ఆశ్రయం ఇస్తున్నారో..దురాక్రమణకు ఎవరు పాల్పడ్డారో, తీవ్రవాదమే అధికార విధానంగా ఎవరు పనిచేస్తున్నారో ప్రపంచ దేశాలకు బాగా తెలుసున్నారు. ఉగ్రవాదం ఉగ్రవాదమేనని, దీన్ని సమర్థించుకునేందుకు పాకిస్తాన్ ఎంతగా ప్రయత్నించినా దాని స్వరూపం మారదని వికాస్ స్వరూప్ అన్నారు. ఈ అంశంపై పాక్‌లోని భారత హై కమిషనర్‌కు సమన్లు పంపడాన్ని ప్రస్తావిస్తూ ‘్భరత్‌లో కాశ్మీర్ అంతర్భాగం..ఇది తిరుగులేని వాస్తవం’అని భారత దౌత్యాధికారి పాక్‌కు తెగేసి చెప్పారని వికాస్ తెలిపారు. భారత్‌లోని పాక్ హైకమిషనర్‌కు అబ్దుల్ బాసిత్‌కు సమన్లు పంపే యోచనే లేదని స్పష్టం చేశారు. బుర్హాన్ విషయంలో పాక్ చేసిన ప్రకటనలను బట్టి చూస్తే ఉగ్రవాదమే ఇప్పటికీ దాని విధానమన్న వాస్తవం మరింతగా తేటతెల్లమైందన్నారు.