జాతీయ వార్తలు

మోదీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: ప్రజాకంటక పాలన సాగిస్తున్న మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకం కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని సీపీఐ (ఎం) నేత సీతారాం ఏచూరి పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా సోమవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మోదీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని, దీనిని ఎదుర్కోవడానికి అన్ని పార్టీలు ఏకం కావాల్సిన సమయం ఏర్పడిందని, ప్రజలు సైతం దీనినే కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఆదివారం అమిత్‌షా ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఉటంకిస్తూ బీజేపీ దేశాన్ని 50 సంవత్సరాల పాటు పాలించాలని కలలు కంటోందని విమర్శించారు. వారి సమావేశంలో పెట్రో ధరల పెంపు, రైతుల కష్టాల గురించి ప్రస్తావనే లేదని, కేవలం తాము అధికారంలో ఎలా కొనసాగాలో అన్నదే వారు నిత్యం కోరుకుంటున్నారని సీపీఐ నేత డి.రాజా విమర్శించారు. విపక్షాలన్నీ ఏకం కావాలని ప్రజల నుంచి వత్తిడి వస్తోందని, ఇది మోదీ ప్రభుత్వాన్ని మరింత ఇబ్బంది పెడుతోందని అన్నారు. పెట్రోధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటడానికి ఎక్సైజ్ సుంకాలు పెరగడమేనని, కేంద్రం సన్నాయి నొక్కులు నొక్కుతోందని, అలాఅయితే ప్రస్తుతం బీజేపీ 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని, మరి ఆ రాష్ట్రాల్లో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి పెట్రోధరల తగ్గింపునకు కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలో ఉన్న కేరళ రాష్ట్రంలో రెండు నెలల క్రితం లీటర్‌కు రెండు రూపాయలు తగ్గించిన విషయాన్ని వారు గుర్తుచేశారు.
బీజేపీ తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సమాజంలో ద్వేషం, హింస భావాలను ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తోందని లెఫ్ట్ నేతలు విమర్శించారు. ఏడు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొని, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నేతలు ఏచూరి, రాజాలను పోలీసులు అరెస్ట్ చేసి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.