జాతీయ వార్తలు

నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై జాప్యమెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: ఆరేళ్ల క్రితం నాటి నిర్భయ సామూహిక మానభంగం, హత్య కేసులో దోషులైన వారిని ఉరి తీసే విషయంలో ఎందుకు జాప్యం జరుగుతోందో వివరించాలని కోరుతూ తీహార్ జైలు అధికారులకు ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీచేసింది. 2012 డిసెంబర్ 12న జరిగిన ఈ అమానుష కృత్యం దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ప్రకంపనలు పుట్టించిన నేపథ్యంలో దోషులను ఉరితీయాల్సిందేనంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. 23 సంవత్సరాల పారా మెడికో విద్యార్థినిపై జరిగిన అత్యాచారం పైశాచికం, ఆటవికమని అభివర్ణించిన సుప్రీంకోర్టు ఈ నలుగురికీ విధించిన మరణశిక్షను ధ్రువీకరించింది. ఈ శిక్షలను సమీక్షించాలంటూ ఈ ఏడాది జూలై దోషులు దాఖలుచేసిన రివ్యూ పిటిషన్లను తిరస్కరించింది. అయితే నాలుగో దోషి మాత్రం తన శిక్ష విషయంలో ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ నలుగురి ఉరిశిక్ష అమలు విషయంలో ఎందుకు జాప్యం జరుగుతోంది అని ప్రశ్నిస్తూ ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మాలీవాల్ తీహార్ జైలు అధికారులకు నోటీసులు జారీచేశారు. ఈ జాప్యానికి సంబంధించి వివరణ ఇవ్వాలని కూడా అధికారులను ఆమె కోరారు. సమాజంలో మానభంగాలను నిరోధించేందుకు ఓ బలమైన సందేశాన్ని అందించాల్సిన అవసరం ఉందని దీని దృష్ట్యా సాధ్యమైనంత త్వరలోనే ఈ నలుగురినీ ఉరితీయాలని స్పష్టం చేశారు. అలాగే ఈ నలుగురినీ ఉరితీయాలని అధికారికంగా ఎలాంటి ఆదేశమైనా వచ్చిందా లేదా అన్న విషయాన్ని కూడా తనకు తెలియజేయాలన్నారు. ఉరి ఆదేశాలు జారీకాని పక్షంలో అందుకు దారితీసిన కారణాలను తనకు తెలియజేయాలని, ఈ నెల 15లోగా సమాధానమివ్వాలని ఆమె కోరారు.