జాతీయ వార్తలు

ప్రజల మద్దతు లేదు: బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: పెట్రోల్ ధరలపై ప్రతిక్షాలు చేపట్టిన భారత్ బంద్‌కు ప్రజల మద్దతు లభించలేదని బీజేపీ తెలిపింది. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ధరల పేరుతో ప్రజలను తప్పుదోవపట్టించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించాయని ఆరోపించారు. ఏ కారణాలచేత ధరలు పెంచాల్సి వచ్చిందో ప్రజలు అర్థం చేసుకున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్రం ప్రజల పక్షానే ఉండి వారి సక్షేమం కోసమే పనిచేస్తోందని మంత్రి చెప్పారు. కాంగ్రెస్ నాయకత్వాన ప్రతిపక్షాలు ఇచ్చిన భారత్ బంద్‌లో ప్రజలు పాల్గొనలేదని ఆయన అన్నారు. దేశంలో హింసను ప్రేరేపించడం ద్వారా రాజకీయ లబ్ధిపొందాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ప్రసాద్ విమర్శించారు. బిహార్‌లో వైద్య సహాయం అందక ఓ బాలిక మృతి చెందిందన్న మంత్రి దానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. యుపీఏ హయాంలోనూ అనేక సార్లు పెట్రోల్ ధరలు పెంచారని మంత్రి గుర్తుచేశారు.

చిత్రం.. ఢిల్లీలో కాంగ్రెస్ కార్యకర్తను చితక బాదుతున్న పోలీసులు