జాతీయ వార్తలు

అమీతుమీకి సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదురై, సెప్టెంబర్ 10: కరుణానిధి మృతి తరువాత డీఎంకే అధికారం కోసం కుమ్ములాటలు కొనసాగుతునే ఉన్నాయి. కరుణ పెద్ద కుమారుడు, బహిష్కృత నేత అళగిరి పార్టీలోకి రావడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. గత వారమే చెన్నైలో భారీ ర్యాలీ నిర్వహించి బలప్రదర్శనకు దిగిన ఆయన మరోసారి మద్దతుదారులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని సోమవారం ప్రకటించారు. త్వరలోనే తన మద్దతుదారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఆయన వెల్లడించారు. పార్టీలోకి మళ్లీ రావాలన్న ఉద్దేశంతో నాయకత్వంపై మరింత ఒత్తిడి పెంచాలని అళగిరి భావిస్తున్నారు. తండ్రి కాంశ్య విగ్రహాన్ని మదురైలో ఏర్పాటుచేయాలని మాజీ కేంద్ర మంత్రి నిర్ణయించారు. సోదరుడు ఎంకే స్టాలిన్‌కు పార్టీ పగ్గాలు ఇచ్చారన్న ఆగ్రహంతో అళగిరి తిరుగుబాటు జెండా ఎగరేశారు. దీంతో 2014లో అధినేత కరుణానిధే ఆయనను డీఎంకే నుంచి బహిష్కరించారు. తండ్రి బతికున్నంతకాలం వౌనంగా ఉన్న అళగిరి తిరిగి పార్టీలోకి రావడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. దీన్లో భాగంగా ఈనెల 5న మెరీనా బీచ్‌లో వౌన ప్రదర్శన చేపట్టారు. అయితే ర్యాలీలో ఒక్క డీఎంకే కార్యకర్త పాల్గొనకపోవడం గమనార్హం. ర్యాలీలో ఎక్కడా కార్యాచరణను ఆయన ప్రకటించలేదు.
స్టాలిన్ తనను పార్టీలోకి రాకుండా అడ్డుకుంటున్నారని, డీఎంకే కార్యకర్తలు, అభిమానుల అండదండలు తనకే ఉన్నాయని అళగిరి చెప్పుకుంటున్నారు. పార్టీ అధిష్ఠానంపై వివిధ రకాల్లో వత్తిడి చేయాలనుకున్న ఫలించకపోవడంతో తన సోదరుడు పార్టీలోకి ఆహ్వానిస్తే అంగీకరిస్తానని సంకేతాలు ఇచ్చారు.
అయితే అధ్యక్షుడు స్టాలిన్ నుంచి ఎలాంటి ఎలాంటి స్పందన లేకపోవడంతో త్వరలోనే అనుచరులతో సమావేశమవ్వాలని ఆయన నిర్ణయించారు.