జాతీయ వార్తలు

భారత-శ్రీలంక సంబంధాలు మరింత బలపడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: భారత-శ్రీలంక దేశాల్లోని ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలు మరింతగా బలపడాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. శ్రీలంక పార్లమెంట్‌కు చెందిన అఖిలపక్ష ప్రతినిధి బృందం స్పీకర్ కారు జయసూర్య నేతృత్వంలో ఇక్కడికి తరలివచ్చిన సందర్భంగా ఢిల్లీలో సోమవారం జరిగిన సమావేశంలోప్రధాని ప్రసంగించారు. ఇరు దేశాల ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలు బలోపేతం కావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మోదీ పిలుపునిచ్చారు. ఇరుదేశాల్లోని రాష్ట్ర అసెంబ్లీలు, గ్రామస్థాయి పాలకవర్గాలతో సైతం పరస్పర సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఇది సాధ్యమవుతుందన్నారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంబంధాలను సైతం ఇరు దేశాలు మరింతగా పెంచుకోవాల్సి ఉందని ఇరు దేశాల ప్రతినిధులు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. భారత ప్రభుత్వ సాయంతోశ్రీలంకలో చేపడుతున్న ప్రజాసంక్షేమ కార్యక్రమాల పట్ల కూడా శ్రీలంక ప్రతినిధి బృందం సంతృప్తిని వ్యక్తం చేసింది. సంయుక్తంగా చేపడుతున్న పలు అభివృద్ధి ప్రాజెక్టులు మరింత వేగవంతంగా అమలు చేయడం ద్వారా ఇరు దేశాల ప్రజల ఆర్థికాభివృద్ధికి దోహదం చేయాలని ఈ సందర్భంగా ఇరుదేశాల ప్రతినిధులు నిర్ణయించారని ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.