జాతీయ వార్తలు

కర్నాటకను ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఇటీవల వచ్చిన వరదల కారణంగా తమ రాష్ట్రంలో దెబ్బతిన్న ఏడు జిల్లాలను ఆదుకోవడానికి కేంద్రం 1199 కోట్ల రూపాయల సహాయాన్ని అందించాలని ప్రధాని మోదీకి కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ, ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వర, మంత్రులు హెచ్‌డి రేవన్న, ఆర్‌వి దేశ్‌పాండే, డికె శివకుమార్, కృష్ణబైరె గౌడ తదితరులతో కూడిన ఉన్నతస్థాయి బృందం ప్రధాని మోదీని కలిసింది. ప్రధానిని కలిసిన అనంతరం సీఎం కుమారస్వామి విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని కోస్తా, మలెనాడు ప్రాంతాలు ఇటీవల వచ్చిన వరదల వల్ల తీవ్రంగా నష్టపోయాయని, పంట, ఆస్తినష్టం సంభవించడమే కాక, పలువురు ప్రాణాలను కోల్పోయారని, ఏడు జిల్లాల్లో తీవ్రంగా నష్టం జరిగిందని, ఆ ప్రాంతాలను ఆదుకోవడానికి 1199 కోట్ల రూపాయలు కేంద్ర సహాయం అందించాలని ప్రధానిని కోరామన్నారు. వరదలు, కొండచరియలు కూలడం వల్ల 3,705.87 కోట్ల రూపాయల నష్టం జరిగిందని ఆయన చెప్పారు. ఇప్పటికే ఎస్‌డిఆర్‌ఫ్ కింద 49 కోట్లు, రాష్ట్ర నిధి కింద 200 కోట్లను వరద ప్రాంతాలను ఆదుకోవడానికి తక్షణ సహాయం కింద విడుదల చేసినట్టు ఆయన చెప్పారు. నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వ బృందాన్ని పంపిస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తమకు ఇదివరకే హామీ ఇచ్చారని ఆయన చెప్పారు.
కర్నాటక రెవెన్యూ మంత్రి దేశ్‌పాండే మాట్లాడుతూ కర్నాటకలోని 17 జిల్లాలు ప్రస్తుతం తీవ్ర కరవు పరిస్థితులను ఎదుర్కొటున్నాయని, వాటిని సైతం ఆదుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. కాగా తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొంటున్న 89 తాలుకాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించే విషయమై రేపు జరిగే కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తర్వాత రాష్ట్రంలో కరపు పరిస్థితులపై సమగ్ర అధ్యయనం నిర్వహించి పూర్తి వివరాలను కేంద్రానికి పంపిస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం పంట నష్టమే 8 వేల కోట్లకు మించి ఉంటుందని ప్రాథమిక అంచనా వేసినట్టు ఆయన చెప్పారు.

చిత్రం..ప్రధాని మోదీని కలిసి పుష్పగుచ్చాన్ని అందజేస్తున్న కర్నటక సీఎం కుమారస్వామి