జాతీయ వార్తలు

ఆర్డినెన్స్‌ను ఆపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 14: వైద్య విద్య ప్రవేశ పరీక్ష (నీట్)కు ఏడాది మినహాయింపునిస్తూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే, కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌పై సుప్రీం కోర్టు ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తామిచ్చిన తుది తీర్పునకు కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ ప్రాథమికంగా విరుద్ధంగా ఉందని, ఇది సరైనది కాదని ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. దీనిపై కేంద్రానికి నోటిసులు జారీ చేసింది. కేంద్రం జారీచేసిన ఆర్టినెన్స్‌ను సవాల్ చేస్తూ సంకల్ప్ ఛారిటబుల్ ట్రస్ట్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టులో గురువారం విచారణకు వచ్చింది. న్యాయమూర్తులు జస్టిస్ అనిల్ ఆర్ దవే, జస్టిస్ శివకిర్తి సింగ్, జస్టిస్ ఏకే గోయల్‌తో త్రిసభ్య ధర్మాసనం ముందు కీలక వాదనలు జరిగాయి. సర్వోన్నత న్యాయస్థానం తుది తీర్పు వెలువరించిన అనంతరం కేంద్రం విరుద్ధమైన ఆర్డినెన్స్ తేవడం చట్ట విరుద్ధమని సంకల్ప్ ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున సీనియర్ న్యాయవాది అమరేందర్ శరణ్ వాదనలు వినిపించారు. ఇది కేవలం ఈ అర్డినెన్స్‌తో ఆగిపోదని, మిగిలిన అంశాల్లోనూ కోర్టు తీర్పును అధిగమిస్తూ ఆరు నెలలకు, ఏడాదికి పొడిగిస్తూ ఆర్డినెన్స్ తెచ్చే ప్రమాదముందని వాదించారు. సుప్రీం తీర్పులో ఏవైనా సమస్యలుంటే మరోసారి కోర్టుని ఆశ్రయించాలే తప్ప, ఆర్టినెన్స్ తేవడం సరైందికాదని, ఇది సుప్రీం తీర్పునకు విరుద్ధమని వాదనలు వినిపించారు. పిటిషన్ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన త్రిసభ్య ధర్మాసనం, ఈవిధంగా ఆర్డినెన్స్ తేవడం సరైన పద్ధతి కాదని వ్యాఖ్యానించింది. అనంతరం కేంద్రం తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్గి వాదనలు వినిపిస్తూ కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే కౌన్సిలింగ్ పూర్తి చేశాయని, జాబితా సిద్ధం చేసుకొన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ పిటిషనన్‌తో మళ్లీ వివాదం మొదటికొచ్చిందని, దీనిపై వాద ప్రతివాదనలు, రాష్ట్రాలు, కళాశాలల సమాధానాల సమర్పణ, విచారణ కొనసాగితే అక్టోబరు అవుతుందన్నారు. ఇప్పటికే 17 రాష్ట్రాలు పరీక్షలు నిర్వహించుకున్నాయని, ఈ సమయంలో మళ్లీ వివాదాన్ని మొదటికి తేవడం సరికాదన్నారు. అనంతరం రెగ్యులేషన్ ప్రకారం దేశావ్యాప్తంగా ఒకే ప్రవేశ పరీక్షకు ప్రభుత్వ వాదనల ప్రకారమే ఆదేశాలిచ్చామని ధర్మాసనం తేల్చి చెప్పింది. కోర్టులో నీట్ ఉండాలని మే 9న తుది తీర్పు వెలువరించామని, తొమ్మిది రోజుల అనంతరం కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసిందని, ఈ మధ్యకాలంలో కొన్ని రాష్ట్రాలు ప్రవేశ పరీక్షలు నిర్వహించండంలో ఔచిత్యమేంటని రాష్ట్రాల వైఖరిని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ ఆర్టినెన్స్ రద్దుచేసే ఆదేశాలు చేకూర్చే అవకాశం ఉందని అభిప్రాయపడిన ధర్మాసనం, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. దీనిపై కేంద్రానికి నోటిసులు జారీ చేసింది. కేంద్రం జారీ చేసిన అర్డినెన్స్‌ను తాము వ్యతిరేకిచడం లేదని, కానీ ఆర్డినెన్స్‌లో కొన్ని అంశాలపట్ల స్పష్టతరావాల్సి ఉందని గోవా విద్యార్థుల తరపున రాజు రామచంద్రన్ కోర్టును విజ్ఞప్తి చేశారు. అభ్యర్థనను విడిగా విచారిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది.