జాతీయ వార్తలు

రష్యాతో ఒప్పందాలపై అమెరికా ప్రభావం ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: రక్షణ, భద్రత అంశాలలో తాము రష్యా దేశంతో కుదుర్చుకున్న ఒప్పందాలు, అమెరికా విధించిన ఆంక్షలపై ఎలాంటి ప్రభావాన్ని చూపవని భారత రక్షణ శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ స్పష్టం చేశారు. వచ్చే నెలలో రష్యా దేశ ప్రధాని పుతిన్ భారత్‌ను సందర్శించనున్న నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ కాలపరీక్షకు నిలబడని రక్షణ, భద్రతాపరమైన ఒప్పందాలను భారత్ ఎన్నడూ అంగీకరించదని అన్నారు. ప్రస్తుతం రష్యాతో ఎస్-400 మిస్సయిల్ కొనుగోలు వ్యవహారం దాదాపు పూర్తి కావొచ్చిందని ఆమె చెప్పారు. భారత్ తన సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకుంటూనే ఇతర దేశాలతో స్నేహం, సౌభ్రాతృత్వాన్ని కొనసాగిస్తుందని చెప్పారు. రష్యాతో రక్షణపరమైన లావాదేవీల నేపథ్యంలో అమెరికా ఇప్పటికే విధించిన ఆంక్షల ప్రభావం భారత్‌పై ఏమైనా పడుతుందా? అన్న ప్రశ్నకు లేదని సమాధానం ఇచ్చారు. పుతిన్ భారత్‌ను వచ్చేనెలలో సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీతో శిఖరాగ్ర చర్చలు జరుపుతారు. ఇరుదేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు మరింత పటిష్టం కావడానికి పలు అంశాలు ప్రస్తావనకు వస్తాయి.
కాగా, రష్యాదేశం భారత్‌కు ప్రధాన ఆయుధ సరఫరా దేశంగా చాలా ఏళ్లుగా ఉంది. కొన్ని సంవత్సరాల మధ్య చర్చల తర్వాత భారత వాయుసేనలో వినియోగించేందుకు ఎస్-400 ఎయిర్ మిస్సయిల్‌ను సరఫరా చేయడానికి ఇరుదేశాల మధ్య 40వేల కోట్ల రూపాయల ఒప్పందం కుదిరింది. ఇలావుండగా అమెరికా సిఎఎటిఎస్‌ఎ చట్టం ప్రకారం రష్యాతో భారత్ కుదిరిన ఒప్పందం విషయంలో కొంత అనిశ్చితి ఏర్పడింది. దీని ప్రకారం తమతో రక్షణ వ్యవహారాలతో సంబంధాలు ఏర్పర్చుకున్న తర్వాత అలాంటి ఒప్పందాలు ఇతర దేశాలతో కుదుర్చుకోరాదన్నది అమెరికా షరతు. ఈ విషయంలో భారత్ అమెరికా అధికారులను ఒప్పించడానికి ప్రయత్నించింది.