జాతీయ వార్తలు

మోదీ @ 68

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 68వ జన్మదినోత్సవం సందర్భంగా దేశానికి చెందిన అనేక మంది ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. తనను అభినందించిన వారందరికీ మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రధానికి శుభాకాంక్షలు తెలిపినవారిలో మొదటగా రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఉన్నారు. ‘్భరత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయురోగ్యాలతో జీవిస్తూ ప్రజలకు ఇలాగే సేవలందించాలి’ అని రాష్టప్రతి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

చిత్రం..తన పుట్టినరోజు సందర్భంగా వారణాసిలో చిన్నారులతో ఉల్లాసంగా గడిపిన ప్రధాని నరేంద్ర మోదీ